Monday, April 29, 2024

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ ప్రతినిధి: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్లూజే ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధనకై గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో గాడిపెల్లి మధు అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ఏకగ్రీవ తీర్మానాలు చేయడం జరిగింది. ఇళ్ల స్థలాల సాధన కోసం టీయూడబ్లూజే 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ సమన్వయకర్తగా సిక్స్‌మెన్ కమిటీ వేయడం జరిగింది.

ఈ కమిటీలో టీడబ్లూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, టీయూడబ్లూజే 143 హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మస్కపురం సుధాకర్, టీయూడబ్లూజే ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య ఉంటారు. ఈ సిక్స్ మెన్ కమిటీ 10 రోజుల్లోగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్ణయించింది. కాకతీయ, ఏకశిలా సొసైటీలకు సంబంధించిన సభ్యుల జాబితాను సిక్స్‌మెన్ కమిటీకి వెంటనే అందించాలని సమావేశంలో తీర్మానం చేశారు.

రెండు హౌసింగ్ సొసైటీల్లో లేని వర్కింగ్ జర్నలిస్టుల పేర్లతో జాబితాను వెంటనే తయారుచేసి ప్రభుత్వానికి అందించాలని, జాబితా రూపొందించడం కోసం పలు పత్రికలు, ఛానళ్లలో పని చేస్తున్న బ్యూరోలు, స్టాఫ్ రిపోర్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే పనిని ఆరుగురు సభ్యుల సమన్వయ కమిటీ చూసుకోవాలని, ఆ కమిటీకి సాయంగా మరో 15 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో టీయూడబ్లూజే 143 హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్, టీయూడబ్లూజే ఐజేయూ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, వరంగల్ కార్యదర్శి దుర్గాప్రసాద్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్ల అమర్, ఉపాధ్యక్షుడు గోకారపు శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News