Monday, April 29, 2024

ఎరుపెక్కిన ఎర్రసముద్రం

- Advertisement -
- Advertisement -

గల్ఫ్ ఆఫ్ ఎడెన్ : ఎర్రసముద్రంలో మరోసారి హౌతి రెబెల్స్ దాడులకు దిగారు. బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లాండాపై రెండు రోజుల క్రితం తిరుగుబాటుదార్లు క్షిపణులతో దాడికి పాల్పడ్డారు. ఈ ట్యాంకర్ నౌకలో 22 మంది భారతీయులు కూడా ఉండటంతో వెంటనే ఈ అత్యయిక స్థితిపై భారత నౌకాదళం స్పందించింది. వెంటనే నేవీ తరఫున గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలోకి క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్టణంను హుటాహుటిన తరలించారు. క్షిపణి దాడులతో ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. ఈ నెల 26వ తేదీ రాత్రి ఈ క్షిపణి దాడి గురించి నౌకాదళానికి అత్యయిక సందేశం (ఎస్‌ఎంఎస్) అందింది. వెంటనే భారత నౌకాదళం అక్కడికి ఐఎన్‌ఎస్ విశాఖను తరలించినట్లు, మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడైంది.

ఘటనలో ఎవరూ మృతి చెందలేదని, సురక్షితంగానే ఉన్నారని సమాచారం అందింది. అయితే భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని వెల్లడైంది. ఈ ఆయిల్ ట్యాంకర్ నౌకలో సిబ్బందిగా 22 మంది భారతీయులు, ఒక్కరు బంగ్లాదేశీయుడు ఉన్నాడు. యెమెన్‌కు చెందిన హౌతీలకు ఇరాన్ పరోక్ష, ప్రత్యక్ష మద్దతు అందుతోంది. ఎర్రసముద్రం మీదుగా తమ నౌక వెళ్లుతుండగా దాడికి గురైన విషయాన్ని సంబంధిత వాణిజ్య నౌకల సంస్థ ట్రాఫిగురా తెలిపింది. ఈ బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్‌తో పాటు , ఓ అమెరికా యుద్ధనౌక, డిస్ట్రాయర్ యుఎస్‌ఎస్ కార్నేపై కూడా హౌతీల దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ హమాస్ పరస్పర దాడుల నేపథ్యంలో ఇప్పుడు రెడ్‌సీ అత్యంత ప్రమాదకర సముద్ర మార్గం అయింది. ఇక్కడ పయనించే రవాణానౌకలపై తరచూ రెబెల్స్ దాడులు తప్పడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News