Monday, April 29, 2024

కార్గో సేవలకు విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

Huge response to Cargo services

 

తక్కువ సమయానికే గమ్యస్థానాలకే పార్సిల్ సర్వీసులు

మన తెలంగాణ, హైదరాబాద్ : ఆర్టిసి అధికారులు కార్గో సర్వీసు ప్రారంభించకు ముందే ఏవైనా డాక్యుమెంట్స్, లేదావస్తువులను అర్జంట్ ఇతర ప్రాంతాలకు తరలించాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళే బుస్సు డ్రైవర్ లేదనా కండక్టర్‌ను బతిమాలుడుకోవాల్సి వచ్చేది. అంతే కాదు ఒక వేళ వారు తీసుకెళ్ళినా ఎంతో కొంత సర్పించు కోవాల్సి వచ్చేది. ఒక వేళవారు ఆడిగినంత ఇచ్చినా వారు ఆ ప్రాంతానికు సదరు డాక్యుమెంట్స్ లేదా వస్తువులను ఇచ్చారా లేదా అనేక అనుమానాలు వచ్చేవి. సదరు వస్తువు తాము పంపించిన ప్రాంతానికి చేరిందని దాన్ని అందుకున్నవారు చెప్పేవరకు కొంత ఆందోళనగానే ఉండేది. కాని లాక్‌డౌన్ సమయంలో( జూన్ 19న) ఆర్టిసి అధికారులు ప్రారంభించిన కార్గో సర్వీసులతో ఇటువంటి సమస్యలన్నింటికి చెక్ పడింది.

ఈ సర్వీసులపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను డిపో సిబ్బందికి అందించారు. సంబంధిత డిపోల నుంచి రాష్ట్రంలో ఏజిల్లాకు వెళ్ళినా ఆయా బస్తాండ్‌లో కోరియర్, కార్గో కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సేవలపై విశేష స్పందన రావడంతో టిఎస్‌ఆర్‌టిసి నగరంతో పాటు జిల్లాల వారీగా ప్రైవేట్ ఏజేంట్లను ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేసింది. కార్గో కొరియర్ ద్వారా జేబిఎస్‌లో నిత్యం లక్ష రూపాయల వరకు ఆదాయం సమకూరుతుంది . ప్రయాణికులు దాని సేవలపై శ్రద్ద చూపుతున్నారు. దాంతో వారు స్థానికంగా ఉండే కొరియర్ పాయింట్ వద్ద తమకు సంబంధించి సామాగ్రి కార్గో, కొరియర్ ద్వారా గమ్యస్థానాలకు పంపించుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరుతుండటంతో ఈ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయాణికు ఆసక్తి చూపుతున్నారు.

ప్రయాణికులు కొరియర్ కష్టాలు తీరడమే కాకుండా ఆర్టిసి అధికారులకు లాక్‌డౌన సమయంలో ఈ కార్గో సర్వీసులను ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. కార్గో సర్వీసులు వస్తువులను పంపడం సురక్షితం క్షేమమే కాకుండా ఆయా వస్తువులకు అధికారులు బీమా సౌకర్యాల్ని కల్పించారు. కోరియర్ పార్సిల్ సర్వీసుకు 75 కిలో మీటర్ల వరకు రూ.20 అదే విధంగా 200 కిలో మీటర్ల వరకు రూ.25 కిలో మీటర్ల దూరం వస్తువులు బరువు ఆధారంగా టిఎస్‌ఆర్టీసీ చార్జీలను నిర్ణయించింది. ప్రయాణికులు తీసుకు వచ్చే పార్సల్ సర్వీస్‌కు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు. దీనికి అదనంగా చార్జీలను వేస్తున్నారు. రూ.5 వేల విలువైన వస్తువులకు రూ. 50 వేల రూపాయాల విలువైన వస్తువులు ఉంటే రూ.100 వరకు ఇన్సూరెన్స్ చార్జీలు తీసుకుంటున్నారు. ఆర్టిసి ద్వారా పార్సిల్ చేసేవారు సంబంధింత వస్తువులను ప్యాకింగ్ చేసి టేపుతో సీజ్ చేయాలి. అడ్రస్, ఫోన్ నెంబర్ ఉండే విధంగా పేపర్‌ను అతికించాల్సి ఉంటుంది. రూ.50 వేల రూయాలకు పై బడి ఉన్న వస్తువులను అధికారులు పరిశీలించి ప్యాకింగ్ చేస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News