Thursday, May 9, 2024

భారత్@2.95 లక్షలు… 2,023 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Strong evidence covid spreads through air

ఢిల్లీ: భారత్ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 2,95,041 మందికి కరోనా వైరస్ సోకగా 2,023 మంది మృత్యువాతపడ్డారు. అదే సమయంలో 1,67,457 మంది కోలుకున్నారు. భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130కి చేరుకోగా.. 1,82,553 మంది చనిపోయారు. కరోనా మహమ్మారి నుంచి 1,32,76,039 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 21,57,538 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 13,01,19,310 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021 ఏప్రిల్ 20 వరకు 27,10,53,392 మంది నమూనాలను పరీక్షించారు. వీటిలో 16,39,357 నమూనాలను నిన్న పరీక్షించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. ఏడు రోజుల వ్యవధిలో భారత్ లో 17 లక్షల మందికి, ఏప్రిల్ నెలలో 34 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో  సెప్టెంబర్ 17న  రికార్డు స్థాయిలో 3.07 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

India reports 295041 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News