Monday, April 29, 2024

ఐదో ట్రోఫీపై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -
india-u19
భారీ ఆశలతో బంగ్లాదేశ్, నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్ సమరం

పొచెఫ్‌స్ట్రూమ్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత యువ జట్టు ఐదో అండర్19 ప్రపంచకప్ ట్రోఫీపై కన్నేసింది. ఇక్కడి సెన్వెస్ పార్క్ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తలపడనుంది. భారత్ ఇప్పటికే నాలుగు సార్లు అండర్19 ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకొంది. మరోవైపు బంగ్లాదేశ్ తొలిసారి ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఇక, లీగ్ దశలో భారత్ అజేయంగా నిలిచింది. అంతేగాక సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత యువ జట్టు దూకుడు మీద ఉంది. యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సెనా, రవి బిష్ణోయ్, కార్తీక్ త్యాగి, కెప్టెన్ ప్రియమ్ గార్గ్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. యశ స్వి, దివ్వాన్ష్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. రవి బిష్ణో య్, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. మరోవైపు గార్గ్ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. టాప్ ఆర్డర్ అసాధారణ రీతిలో చెలరేగి పోతుండడంతో గార్గ్‌తో సహా చాలా మందికి బ్యాటింగ్ చేసే అవకాశాలే లభించడం లేదు. అయితే కెప్టెన్‌గా మాత్రం గార్గ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పరిస్థితులకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును అజేయంగా నిలిపాడు.

ఫైనల్లోనూ తన నాయకత్వ ప్రతిభతో జట్టును విశ్వవిజేతగా నిలుపాలని తహతహలాడుతున్నాడు. ఇక, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఇప్పటికే ఓ శతకం, మూడు అర్ధ శతకాలు సాధించిన జైస్వాల్ ఫైనల్లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ సమరంలో శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో జరిగే తుది సమరంలో కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. దివ్యాన్ష్ కూడా నిలకడైన ఆట తో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సెమీస్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా రాణించాడు. ఇక, బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాడు.

ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తి స్తూ వికెట్ల పంట పండిస్తున్నా డు. ఇప్పటికే రవి 13 వికెట్లు త న ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుం ది. మరోవైపు కార్తీక్ త్యాగి కూడా అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోతున్నా డు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జ ట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఇప్పటి కే తన స్వింగ్‌తో 11 వికెట్లు పడగొట్టా డు. తుది సమరంలో కూడా సత్తా చా టాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవై పు తిలక్‌వర్మ, ఆకాశ్ సింగ్, శుభంగ్ హెగ్డే, సుశాంత్ మిత్రా, అథర్వ అంకోలేకర్, సిద్దేశ్ వీర్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సంచలనం కోసం

మరోవైపు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ యువ జట్టు ఏకంగా ఫైనల్‌కు చేరుకుని పెను ప్రకంపనలే సృష్టించింది. సెమీఫైనల్లో పటిష్టమైన న్యూజిలాండ్‌పై సంచలన విజయం సాధించింది. మహ్మదుల్ హస్ జాయ్, తంజీద్ హసన్, పర్వేజ్, తౌహిద్, షాదాత్ హుస్సేన్, కెప్టెన్ అక్బర్ అలీ, హసన్ మురాద్, తన్జీమ్ హసన్ సాకిబ్, షాహిన్ ఆలమ్ తదితరులతో బంగ్లాదేశ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. హసన్ జాయ్, తౌహిద్, షాదాత్, తంజీద్ తదితరులు నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిస్తున్న బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఫైనల్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.

జట్ల వివరాలు:

భారత్: యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా, తిలక్ వర్మ, ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), సిద్దేశ్ వీర్, అథర్వ అంకోలేకర్, రవి బిష్ణోయ్, ఎస్.రావత్, కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్, విద్యాధర్ పాటిల్, శుభంగ్ హెగ్డే, సుశాంత్ మిశ్రా, కుమార్ కుశాగ్రా.

బంగ్లాదేశ్: పర్వేజ్ హుస్సేన్, తంజీద్ హసన్, మహ్మదుల్ హసన్ జాయ్, తౌహిద్, షాదాత్ హుస్సేన్, అక్బర్ అలీ (కెప్టెన్), షమీమ్, రకిబుల్ హసన్, షరిఫుల్ ఇస్లాం, తంజీమ్ హసన్ సాకిబ్, హసన్ మురాద్, మృత్యుంజయ్ చౌదరి, అవిషేక్ దాస్, ప్రాంతిక్ నబిల్, షాహిన్ ఆలమ్.

india u19 vs bangladesh u19 final match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News