Monday, April 29, 2024

భారతీయుల్లో భారతీయత కావాలి

- Advertisement -
- Advertisement -
  • యోగాతో విశ్వగురు స్థానం
  • జిల్లా విద్యా శాఖ సెక్టోరియల్ ఆఫీసర్ బాస్కర్

సిద్దిపేట : భారతీయుల్లో భారతీయత లోపిస్తుందని జిల్లా విద్యా శాఖ సెక్టోరియల్ ఆఫీసర్ నేతి భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పిల్లల యోగ ఆకాడమీ ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి వల్ల సనాతన భారతీయ సంస్కృతి విలువలు, సాంప్రదాయాలు తరిగిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 10000 సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి రూపొందించిన మార్గ దర్శకాలు ఆచరించడం అని వార్యమన్నారు. 2042 వరకు భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావడానికి యోగా, సనాతన సంస్కృతి , చిరుధాన్యాల వినియోగం, పునాదులుగా మారుతాయన్నారు. విద్యార్థులు అద్భుత వ్యక్తులుగా శక్తులుగా తీర్చిదిద్దడానికి యోగ గురువులు, తల్లిదండ్రులు సమాజం ప్రత్యేక శ్రద్ధ వహించడం అనివార్యం అని చెప్పారు.

అనంతరం జిల్లా యోగాసన స్పోర్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట ఆశోక్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్ని ఆస్తులు సంపదలు ఇచ్చిమన్నది ముఖ్యం కదాని వారికి చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడం విలువలను అందించడం ముఖ్య మన్నారు. అదే విధంగా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కొమురవెల్లి అంజయ్య మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలను చక్కటి బాటలో పురోగమింప చేయడానికి యోగా విద్య ఉపయోగపడుతుందన్నారు. వ్యాసమహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు నిమ్మశ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర యోగా అధ్యయన పరిషత్ సభ్యులు, యోగా గురువు తోట సతీష్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మురళీదర్, యోగా శిక్షకులు తోట సంద్య, పూజ, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News