Saturday, April 27, 2024

పలు పార్టీల నుంచి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Invitation from multiple parties:Harbhajan

తెలివిగా నిర్ణయముంటుంది: మాజీక్రికెటర్ హర్భజన్‌సింగ్

చండీగఢ్: తనకు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, దేనిలో చేరాలనేది తెలివిగా తీసుకోవాల్సిన నిర్ణయమని మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అన్నారు. శుక్రవారం క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించిన హర్భజన్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాల మధ్య ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తన భవిష్యత్ ప్రణాళికను ఇంకా నిర్ణయించలేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో చేరాలనేది అర్ధమనస్కంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాదని, ఎంతో తెలివిగా ఆలోచించాల్సిన అంశమని హర్భజన్ అన్నారు. అందుకు పూర్తిస్థాయిలో సిద్ధమై ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలుచుకోవడంలో ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్‌ది కీలక పాత్ర. ఇటీవల కాంగ్రెస్ పంజాబ్ చీఫ్, మాజీ క్రికెటర్ నవజోత్‌సింగ్ తనతోఉన్న హర్భజన్ ఫోటోను పోస్ట్ చేయడం ఊహాగానాలకు తావిచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హర్భజన్ ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News