Monday, April 29, 2024

మేనకపై రూ 100 కోట్ల పరువు నష్టం దావా..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ మేనకా గాంధీపై ఇస్కాన్ సంస్థ రూ 100 కోట్లకు పరువు నష్టం దావాకు సిద్ధం అయింది. ఈ మేరకు ఆమెకు నోటీసు పంపించినట్లు ఇస్కాన్ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇస్కాన్ సంస్థ శ్రీకృష్ణుని భక్తి పేరిట అక్రమాలకు దిగుతోందని, ఇస్కాన్ గోశాలలోని ఆవులను, ఇతర జంతువులను కబేళాలకు అమ్ముతున్నారని ఇటీవలే మేనకా గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. ఇప్పుడు మేనకా గాంధీకి పరువునష్టం దావా నోటీసు పంపించినట్లు ఈ సంస్థ ఉపాధ్యక్షులు రాధారాం దాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులు , శ్రేయోభిలాషులు ఈ అసత్య ఆరోపణల పట్ల కలత చెందారని, ఇవి కేవలం దురుద్ధేశపూరిత ఆరోపణలు అని ఇస్కాన్ ప్రతినిధి తెలిపారు. మేనకకు తగు విధంగా పాఠం చెప్పేందుకు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించినట్లు దాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News