Monday, April 29, 2024

ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ…

- Advertisement -
- Advertisement -

Kriti Sanon to play female lead role in 'Adipurush'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో నిర్మాణం కాబోతున్న భారీ ప్రతిష్టాత్మక మూవీ ‘ఆదిపురుష్’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా వందల కోట్ల బడ్జెట్ తో ఒక విజువల్ వండర్ మాదిరిగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. సీత పాత్రకు ఆ హీరోయిన్, ఈ హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ కృతిసనన్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తూనే ఉంది.

ఇప్పటి వరకు కృతి పేరు వార్తల్లో వస్తున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులు కానీ, ఆమె కానీ ఖండిస్తూ చిన్న ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఆమె పేరునే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ ప్రారంభమైందని సమాచారం. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించబోతున్న ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Kriti Sanon to play female lead role in ‘Adipurush’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News