Sunday, April 28, 2024

జ‌ర్న‌లిస్టుల‌ను వేధిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లకు కెటిఆర్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

KTR orders stern action against harassers of journalists

హైదరాబాద్: సోష‌ల్ మీడియా ద్వారా సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీ శాఖ‌ కేటీఆర్ ఆదేశించారు. జ‌ర్న‌లిస్టుల‌ను అవ‌మానిస్తూ, వేధిస్తున్న దుర్మార్గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, తుల‌సి చందు అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు త‌న‌కు జ‌రుగుతున్న అవ‌మానాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు. తాను మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌ను కాబ‌ట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో వేధిస్తున్నార‌ని, ప్ర‌శ్నిస్తున్న జ‌ర్న‌లిస్టుల‌ను ఏకంగా యాక్సిడెంట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా త‌మ‌ను బెదిరిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తుల‌సి చందు కోరారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీవ్రంగా స్పందించిన కేటీఆర్.. జ‌ర్న‌లిస్టుల‌ను వేధిస్తున్న దుర్మార్గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని కోరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News