Monday, April 29, 2024

మోడీజీ.. కొవిడ్ బాధ్యతలను గడ్కరీకి ఇస్తే మేలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ నియంత్రణ సంబంధిత నిర్వహణ బాధ్యతలను ప్రధాని మోడీ వెంటనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని బిజెపి నేత, ఎంపి సుబ్రమణ్య స్వామి సూచించారు. చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్న సంచలనాల స్వామి ప్రస్తుత కరోనా దశలో బుధవారం స్పందించారు. ప్రధాని మోడీ కరోనా తీవ్రతపై మరింత వాస్తవికతతో వ్యవహరించాల్సి ఉంటుందని, దీని కట్టడి బాధ్యతలను గడ్కరికి అప్పగించడం మంచిదన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇక రాబోయే 3వ వేవ్‌తో మరింత ముప్పు వాటిల్లుతుంది. ఇది ప్రత్యేకించి పిల్లలపై దాడి చేస్తుందని స్వామి హెచ్చరించారు. కరోనా వైరస్ దేశానికి తలెత్తిన అప్రకటిత యుద్ధం. దీని నుంచి మనం బయటపడాల్సి ఉంది. ఇంతకు ముందు దేశం ఇస్లామ్ దురాక్రమణదారులు, తరువాత బ్రిటిషన్ సామ్రాజ్యవాదుల నుంచి బయటపడ్డట్లుగా ఇప్పుడు మనం ఈ భీకర దాడి నుంచి విముక్తలం అవుతామని వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో తగు ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈసారి వచ్చే మూడోవేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.

కరోనాపై పోరును మరింత బహుముఖం చేయాల్సి ఉంది. ప్రధాని మోడీ ఇప్పటిలాగానే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని (పిఎంఒ), కొందరిని నమ్ముకుంటే పోతే ఫలితం ఉండదని, కరోనాపై పోరు బాధ్యతలను గడ్కరికి అప్పగించడం మంచిదని స్వామి ప్రధానికి సలహా ఇవ్వడం రాజకీయ వర్గాలలో సంచలనానికి దారితీసింది. గడ్కరీ కేంద్రంలో రోడ్డు రవాణా, హైవేలు సంబంధిత వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. కొవిడ్ నివారణ బాధ్యతలను గడ్కరికి అప్పగించడం ఎందుకు అనే అంశంపై స్వామి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుత ఆరోగ్య అత్యయిక స్థితి తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్థన్‌ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌పై స్వామి స్పందించారు. ఆయన చేయాల్సింది చేస్తున్నారని, అయితే ఆయనకు పూర్తిస్వేచ్ఛలేదని, అంతేకాకుండా డాక్టర్ అయిన హర్ష్‌వర్థన్ మృధుస్వభావి, ఆయన తన అధికారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే రాజకీయపు తెలివితేటలతో లేరని, గడ్కరీ అయితే ఈ విషయంలో పూర్తిగా రాణిస్తారని తేల్చిచెప్పారు.

Make Nitin Gadkari in charge of covid 19 War: Subramanian swamy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News