Sunday, April 28, 2024

పచ్చదనంతో పుడమితల్లి పులకరిస్తోంది

- Advertisement -
- Advertisement -

Mambapur and Nallavelli forest areas Hetero company adopted

 

మంబాపూర్, నల్లవెల్లి

అటవీ ప్రాంతాలు దత్తత

తీసుకున్న హెటిరో సంస్థ

అభివృద్ధికి రూ. 5కోట్ల చెక్కును అందజేసిన ఛైర్మన్ పార్థసారథి రెడ్డి

మనతెలంగాణ/హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల అభివృద్ధి, పచ్చదనాన్ని పొందించేందుకు చేస్తు న్న కృషిలో తమవంతు సామాజిక బాధ్యతగా హెటిరో డ్రగ్స్‌సంస్థ ముందుకు వ చ్చింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సం తోష్ కుమార్ స్ఫూర్తితో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్, నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని హెటిరో డ్రగ్స్ సోమవారం దత్తత తీసుకుంది. అటవీప్రాంత అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో భాగంగా రూ. 5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారథి రెడ్డి ప్రభుత్వానికి అందించారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో దత్తత ప్రాంతంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి పార్థసారథి రెడ్డి మొక్కలు నాటారు. ఈ అటవీ ప్రాంతం హైదరాబాద్ శివారు నర్సాపూర్ రోడ్డులో ఉన్న మంబాపూర్ అర్బన్ ఫారెస్టు బ్లాక్ మూడు కంపార్ట్ మెంట్లలో విస్తరించి ఉంది.

దీనిలో 1777 ఎకరాలు మంబాపూర్‌లో, 766 ఎ కరాలు నల్లవెల్లిలో ఉన్నాయి. గండ్లపోచంపల్లి, దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరం, 18 నుంచి 20 నిమిషాల ప్ర యాణంలో ఈ అటవీ ప్రాంతం ఉంది. ఇటీవల నర్సాపూర్‌లో పర్యటించి నప్పుడు సిఎం కెసిఆర్ ఈ అటవి భూములను రక్షణాత్మక చర్యల ద్వా రా అభివృద్ధి పరచాలని ఆదేశించారు. ఔటర్ పక్క న విస్తరిస్తున్న అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో పాటు, సమీప గ్రామాలకు, దుండిగల్ ఎయిర్ ఫోర్స్,పారిశ్రమిక వాడలకు, నర్సాపూర్, మెదక్, బోధన్ రహదారిపై ప్రయాణికులకు అనుకూలం గా ఉంటుందని తెలిపారు. ఇటీవల బాహుబలి ప్రభాస్, ఇప్పుడు హెటిరో డ్రగ్స్ పర్యావరణ స్ఫూ ర్తితో ముందడుగు వేయడం అత్యంత అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అ న్నారు. వీరి దారిలోనే మరికొందరూ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందకు వస్తున్నారని వివారలు త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.

మంబాపూర్ అటవీ ప్రాంతం ప్రాధాన్యత

మంబాపూర్ అటవీ ప్రాంతంలో కొద్ది ఎకరాల స్థలంలో అర్బన్ ఫారెస్టు పార్కు అభివృద్ది చేయనున్నారు. 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని స్థిరరీకరించడం, అక్రమణలకు గురికాకుండా 25కిలో మీటర్ల పరిధిలో ఫెన్సింగ్ వేయడం, రక్షిత అటవీ ప్రాంతంలోకి మానవ, పెంపుడు జంతువులను నియంత్రించడం ద్వారా సహజ అటవీ పునరుద్ధరణ చేయనున్నారు. ఈ ప్రాంతాలు స్వచ్ఛమైన ఆక్సిజన్ కేంద్రాలుగా మారేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ ప్రాంతంలోని చుక్కగుట్టలో ఎకో ట్రెక్కింగ్,విద్యార్థులకు పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. అరుదైన వృక్షజాతులను పెచడంతో పాటుగా జింకలు, మనుబోతులు, తోడేళ్లు, కుందేళ్లు, నెమళ్లు పెంచనున్నారు. ఈ కార్యక్రమమంలో ఎంఎల్‌సి వి.భూపాల్ రెడ్డి, ఎంఎల్‌ఏ జి.మహిపాల్ రెడ్డి, అటవీశాఖ స్పెషల్ సిఎస్ శాంతకుమారి, పిసిసిఎఫ్ ఆర్.శోభ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతారావు , గ్రీన్‌ఇండియాఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News