Sunday, April 28, 2024

‘టీకా’ రాజకీయం..!

- Advertisement -
- Advertisement -

60 శాతం డోసులు ఆ‘8’ రాష్ట్రాలకే
తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్న కేంద్రం
30 లక్షల అడిగితే నాలుగున్నర లక్షల డోసులు సరఫరా
ఈ నెమ్మదితో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్న నిపుణులు

covid vaccine centers increase from tomorrow in telangana

మన తెలంగాణ/హైదరాబాద్ : టీకాల సప్లాయ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. కేంద్రానికి అనుకూలం, అవసరమున్న రాష్ట్రాలకే అత్యధిక డోసులు ఇస్తున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే అర్ధం అవుతోంది. దేశ వ్యాప్తంగా మహరాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ స్టేట్స్‌కు ఎక్కువ సంఖ్యలో డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఉత్పత్తి అయి న డోసుల్లో ఏకంగా 60 శాతం ఆయా రాష్ట్రాలకు పంపించడం గమనార్హం. అయితే తెలంగాణకు మాత్రం కేంద్ర మొండిచెయ్యి చూపుతోంది. మూడు రోజుల క్రితం తమ కు 30 లక్షల డోసులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న సిఎస్ సోమేష్‌కుమార్ కేంద్రానికి లేఖ రాయగా, కేవ లం నాలుగున్నర లక్షల డోసులు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. వాస్తవంగా కరోనా నియంత్రణకు మన రాష్ట్రంలో ప్రతి రోజు లక్ష మందికి పైగా టీకా ఇవ్వాలని అధికారులు లక్షం పెట్టుకున్నారు. కానీ కేంద్రం ఇచ్చే డోసులు తమకు ఎటూ సరిపోవడం లేదని ఓ అధికారి తెలిపారు. దీంతో వ్యాక్సినేషన్‌ను స్పీడప్ ఎలా చేయాలని వైద్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్రం సకాలంలో డోసులు పంపిణీ చేయకపోవడంతో ఇప్పటికే పలు సెంటర్లలో ‘నో స్టాక్ వ్యాక్సిన్’ అని బోర్డులు కూడా పెట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే తమకు కూడా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అత్యధికంగా మహరాష్ట్రకే…
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధికంగా మహరాష్ట్రకు 89,49,560 డోసులను కేంద్రం పంపిణీ చేసింది. అదే విధంగా రాజస్థాన్‌కు 82,87,840, గుజరాత్‌కు 81,47,689, ఉత్తర ప్రదేశ్ 78,47,622, వెస్ట్‌బెంగాల్ 70,55,520, కర్ణాటక 52,30,642, మధ్యప్రదేశ్ 49,73,398, కేరళకు 41,49,413 డోసులు ఇవ్వగా, తెలంగాణకు మాత్రం కేవలం 26 లక్షల 78వేల 192 డోసులను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల్లో స్పష్టం అవుతోంది. వీటిలో అత్యధికంగా బిజేపి పాలిస్తున్న రాష్ట్రాలు ఉండగా, ఒకటి రెండు స్టేట్స్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేగాక మరి కొన్ని రాష్ట్రాలు పైకి విభేదించినా, లోలోపల కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి పనికి మద్ధతు ఇస్తుంటాయి. దీంతోనే ఆయా రాష్ట్రాలకు ఎక్కువ డోసులు వెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి ఆప్ ది రికార్డులో చెప్పారు. అయితే డోసుల పంపిణీలో ఇలా వ్యత్యాసం చూపడాన్ని పలు రాష్ట్రాలు తప్పుబడుతున్నాయి. టీకాలు లేకుండానే ప్రధాన మంత్రి ప్రకటించిన టీకా ఉత్సవ్‌లు ఎలా నిర్వహించాలని? విమర్శలు వస్తున్నాయి.
సెకండ్ డోసుకు ఇబ్బంది లేదు : డా జి శ్రీనివాసరావు, హెల్త్ డైరెక్టర్
రాష్ట్రంలో సెకండ్ డోసులకు ఎలాంటి ఇబ్బంది లేదని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఫస్ట్‌డోసు తీసుకున్న లబ్ధిదారులందరికీ సెకండ్ డోసు నిల్వలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మన రాష్ట్రానికి 26 లక్షల 78 వేలకు పైగా డోసులు రాగా, 22 లక్షలను పంపిణీ చేశామన్నారు. దీంతో ప్రస్తుతానికి నాలుగున్నర లక్షలు నిల్వ ఉండగా, సోమవారం రాత్రి మరో నాలుగున్నర లక్షల డోసులు వచ్చాయన్నారు. వీటిలో రెండు లక్షలు కొవాగ్జిన్ డోసులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి కేంద్రం సరఫరా చేసిన మొత్తంలో 90 శాతం కొవిషీల్డ్ డోసులు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో వ్యాక్సినేషన్‌లో మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఏకంగా సగటున లక్ష మందికి టీకా ఇవ్వాలని లక్షం పెట్టుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ మేరకు కేంద్రానికి మరో 30 లక్షల డోసులు అడిగితే కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే పంపినట్లు ఆయన గుర్తుచేశారు. అయితే కరోనా నియంత్రణకు అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. టీకా సెంటర్‌లో ఏ డోసు లభిస్తే దాన్ని త్వరగా వేసుకోవాలన్నారు. కంపెనీ, బ్రాండ్‌లు ఏదైనా వాటి పనితీరు వైరస్‌ను అడ్డుకోవడమేనన్నారు. ప్రస్తుతానికి మనకు వచ్చిన టీకాలు రెండూ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయన్నారు. అంతేగాక తాజాగా రష్యా తయారు చేసిన స్ఫుత్నిక్ వీ కి కూడాడిసిజిఐ(డ్రగ్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఇండియా) అత్యవసర వినియోగానికి పర్మీషన్ ఇచ్చిందన్నారు. ఈ డోసులు కూడా అతి త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు కరోనా పేషెంట్ల చికిత్సకు వాడే రెమిడెసివీర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 65 హాస్పిటల్స్‌లో 2 లక్షల రెమిడెసివీర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల మందులు, మౌళికవసతులు, మ్యాన్‌పవర్ సిద్ధంగా ఉ ందన్నారు. అయితే గతంలో 15 నుంచి 20 శాతం మంది హాస్పిటలైజేషన్ అవుతుండగా, ఈ సేకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు 7 నుంచి 8 శాతం మంది ఆసుపత్రుల పాలైయ్యారని డిహెచ్ గుర్తుచేశారు. కావున ప్రజలంతా మరిన్ని రోజుల కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

 

రాష్ట్రం       డోసుల సంఖ్య
మహరాష్ట్ర 89,49,560
రాజస్థాన్ 82,87,840
గుజరాత్ 81,47,689
యూపి 78,47,622
వెస్ట్‌బెంగాల్ 70,55,520
కర్ణాటక 52,30,642
ఎంపి 49,73,398
కేరళ 41,49,413
తెలంగాణ 26,78,192

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News