Monday, April 29, 2024

యువతకు గతి శక్తి పథకం: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi speech in 75th Independence Day

ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సమరయోధులను దేశం స్మరించుకుంటుందన్నారు. ఒలింపిక్స్‌లో దేశ అథ్లెట్లు సత్తా చాటారని కొనియాడారు. ఒలింపిక్స్ అథ్లెట్లను చూసి దేశ యువత గర్విస్తుందన్నారు. ఒలింపిక్ష అథ్లెట్ల కోసం చప్పట్లు కొటి అభినందించారు. దేశ సరిహద్దులో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు.

కరోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానం అని పొగిడారు. కరోనాకు మందు కనుగొనడంలో భారత శాస్త్రవేత్తలు ముందు వరసలో ఉన్నారని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లోనే నిర్వహించామన్నారు. ఏడాది పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించే ఏర్పాటు చేశామని, ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్-లాద్దాక్ అభివృద్ధి దృష్టి పెట్టామన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు త్వరలోనే రైల్వే కనెక్టివిటీ పూర్తి కానుందని మోడీ పేర్కొన్నారు.

సముద్ర వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని, జమ్మూ కశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, సముద్ర వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పన కోసం ప్రధాన మంత్రి గతి శక్తి పథకం ప్రారంభిస్తున్నామని, గతి శక్తి పథకంలో భారత మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వృద్ధి చెందుతోందని, గతి శక్తి పథకం కోసం రూ.100 లక్షల కోట్లు కేటాయిస్తామని, ప్రపంచ దేశాలన్ని మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పని చేయాలని మోడీ సూచించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి సారించాలన్నారు. వేలాది అనవసర పురాతన చట్టాలను రద్దు చేశామని, కరోనా సమయంలో 15 వేలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించామని, త్వరలో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నూతన జాతీయ విద్యావిధానంతో విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెరుగుతోందన్నారు.

కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించామని, దేశంలో 54 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని వెల్లడించారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో మరణాలు తక్కువగా ఉన్నాయని, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వ్యాధి సంక్రమణ తక్కువగా ఉందన్నారు. దేశ విభజన గాయం ఇంకా వెంటాడుతునే ఉందని, దేశ విభజన సమయంలో వేలాది మంది ధన, మాన, ప్రాణ నష్టానికి గురయ్యారన్నారు. జల్ మిషన్ కింద 4.5 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా నీళ్లు ఇస్తున్నామని, సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాష్ నినాదంతో పని చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News