Monday, April 29, 2024

ఒక్కరోజే 15413 కేసులు

- Advertisement -
- Advertisement -

దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు
నాలుగురోజులుగా వైరస్ ఉధృతి

More Corona cases increased in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోగుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 15,413 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకర పరిణామంగా మారింది. వైరస్ తీవ్రతతో మరో 306 మంది మృతి చెందారు. దీనితో దేశంలో కోవిడ్ 19 మరణాల సంఖ్య ఆదివారం నాటికి 13254కు చేరుకుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలో కరోనా వైరస్ ప్రభావానికి సంబంధించి అధికారిక గణాంకాలను వెలువరించింది. లాక్‌డౌన్‌ల దశ ఉండదని, ఇక దేశంలో అంతా అన్‌లాక్‌లే అని ఇటీవలే ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ దశలో గత నాలుగు రోజులుగా దేశంలో ఒక్కరోజువారి కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతోంది. కొత్తగా 15,413 మందికి వైరస్ అంటుకోవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,10461 అయిందని గణాంకాలతో స్పష్టం అయింది.

ఇదే సమయంలో దేశంలో వైరస్ నుంచి రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికీ 2,27765 మంది రోగులు కోలుకున్నారు. దేశంలో 1,69,451 యాక్టివ్ కేసులు ఉండటంతో పరిస్థితి విషమంగానే ఉందని ఆందోళన చెందుతున్నారు. రికవరీ రేటు ఇప్పుడు 55.48 శాతం అయింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో దేశంలో మొత్తం మీద కరోనా ప్రభావం తీవ్రస్థాయిని సూచిస్తోంది. వరుసగా పదిరోజులుగా దేశంలో పదివేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ దేశంలో 2,19,926 కేసులు అదనంగా తలెత్తాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో అత్యధిక కేసులు నమోదు అవుతూ రావడం,ఆయా రాష్ట్రాలలోనే కరోనా మృతుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈ ఐదు రాష్ట్రాల పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.

ఢిల్లీలో ఒక్కరోజే 3630 కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసుల ఉద్ధ ృతి పెరుగుతోంది. ఒక్కరోజే 3630 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 56000కు చేరింది. మృతుల సంఖ్య 2112గా నమోదైందని అధికారులు తెలిపారు. ఒక్కరోజులో 3000కు పైగా కేసులు రావడం ఢిల్లీలో ఇది రెండోసారి. ఈ నెల 19వ తేదీనే ఇక్కడ 3137 మందికి కరోనా పాజిటివ్ తేలింది. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 77 మంది కరోనా తీవ్రతతో కన్నుమూశారని వెల్లడైంది.

ఢిల్లీ ఆరోగ్యమంత్రి పరిస్థితి ఓకె

కరోనా సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతోన్న జైన్ శనివారం ప్లాస్మా థెరపీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా తీవ్రత పెరుగుతూ ఉన్న ఢిల్లీలో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించి ఛార్జీలను ఖరారు చేసింది. ఐసోలేషన్ బెడ్స్‌కు ప్రతిరోజు చొప్పున రూ 8వేలు నుంచి 10వేలుగా ఖరారు చేశారు. ఇక వెంటిలేటర్‌తో కూడిన ఐసోలేషన్ బెడ్స్‌కురోజువారిగా రూ15500 నుంచి రూ 18000గా నిర్ణయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News