Monday, April 29, 2024

జిల్లాలో జోరుగా… నాటుకోళ్ల పెంపకం

- Advertisement -
- Advertisement -

పల్లెలు, పట్టణాల్లో మంచి డిమాండ్
కిలోకు రూ.350 నుంచి 500
నాటుకోళ్ల పెంపకానికి యువత ఆసక్తి

పల్లెలు, పట్టణాల్లో కూడా నాటుకోడి అంటే ఇష్టపడే వారి సంఖ్య రోజరోజుకు పెరిగిపోతోంది. ఆదివారాలు, పండుగలు, సెలవుదినాలు, బర్త్‌డేలు, ఇయర్ ఎండింగ్ పార్టీలు ఏవైనా సరే అందరికీ ఇప్పుడు ముందుగా నాటుకోడే గుర్తుకు వస్తోంది. నాటు కోడి పులుసు కోసం జనాలు లోట్టలు వేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా మార్కెట్‌లోనూ నాటుకోళ్ల సరఫరా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది పట్టణాలకు తీసుకొచ్చి అమ్మతున్నారు. కొన్ని చోట్ల హైవేలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫోన్ చేస్తే చాలు ఆర్డర్ తీసుకుని తెచ్చి ఇస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనా సరే నాటుకోళ్లను తినేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. దీంతో నాటు కోళ్ల పెంపకంపై యువత, రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఉన్న పరిసర ప్రాంతాలతో పాటు నంగునూర్, చిన్నకోడూరు మండలాల్లో నాటు కోళ్ల పెంపకం జోరందుకుంది. సిద్దిపేట నుంచి హుస్నాబాద్, హన్మకొండ హైవే వైపు, సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో పొన్నాల దాబాల పరిసరాల్లో, ఇటు వేములవాడ, సిరిసిల్ల, మెదక్ , కరీంనగర్ హైవేల వెంబడి నాటు కోళ్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. కోళ్ల ఫారాల వద్దనే.. కాంటాలు ఏర్పాటు చేసి తూకం వేసి వీలైతే అక్కడే వండుకునేందుకు సిద్ధంగా చికెన్ కొట్టి ఇస్తున్నారు. కోడి కిలోకు రూ. 350 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని బ్రాండ్‌ల పేరుతో ఏకంగా రూ. 700కిలో వరకు విక్రయిస్తున్నారు. ప్రత్యేక పార్టీలు, దవాత్‌లకు అక్కడే వండి మరి డెలివరీ చేస్తూ మరికొందరు ఉపాధి పొందుతున్నారు. నాటుకోడి పులుసు, బొంగు చికెన్, కుండ చికెన్ పేరుతో రకరకాల వంటకాలను రుచి చూపిస్తూ.. నాటు కోళ్లను జోరుగా విక్రయిస్తున్నారు.

నాటు కోళ్ల పెంపకంపై యువత ఆసక్తి

కరోనా వైరస్ విజృంభన త్వరాత నాటు కోళ్ల విక్రయిలు మరింత జోరందుకున్నాయి. నాటు కోడి తింటే కరోనా వైరస్ దరిచేరదనే నమ్మకం వైరస్‌కంటే వేగంగా వ్యాప్తి చెందింది. లాక్‌డౌన్‌లో అనేక మంది యువత ఉపాధి కోల్పోయి హైదరాబాద్ వంటి పట్టణాలనుంచి ఊళ్లకు తిరిగి వచ్చే శారు. ఈ క్రమంలో వారు ఉపాధి మార్గంగానూ నాటు కోళ్ల పెంపకాన్ని ఎంచుకుని మంచిలాభాలు గడిస్తున్నారు. కోడి పిల్లలను తమిళనాడు నుంచి తీసుకొచ్చి కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారుఉ. వాటిని తీసుకొచ్చి వ్యవసాయ బావుల వద్ద షెడ్డులు ఏర్పాటు చేసి కోడి పిల్లలను పెంచుతున్నారు. ఒక్కో కోడి పిల్ల ధర సుమారుగా రూ. 30 నుంచి రూ. 45 మధ్య ఉంటుంది. సీడ్ ను బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఒకకోడి పిల్లలు సుమారు మూడు నెలల వరకు 2 నుంచి 3కిలోల బరువు వస్తుంది . కోడి మార్కెట్‌లో విక్రయించే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలి. కోడి బరువు పెరిగే కొద్ది దానా ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మొక్కజొన్న దానాను రైతులు వినియోగిస్తున్నారు. తర్వాత వాటిని విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తా సుమారు 1400 వరకు ఉంటుంది. దాదాపు 1000 పిల్లలను షెడ్డులో పెంచితే అన్ని ఖర్చులు పోనూ రూ . 60వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.

ఉపాధి కోసం నాటుకోళ్ల పెంపకం

నేను డిగ్రీ చదివినా.. ఉద్యోగం ప్రయత్నించి విఫలమయ్యాను. ప్రస్తుతం నాటుకోళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని ఉపాధి కోసం నాటుకోళ్ల పెంపకాన్ని ఎంచుకున్న. వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని తాత్కాలికంగా షెడ్డు వేసాను. వాటిలో 500 పిల్లలను వేశాను. మూడు నెలల వరకు క్రాప్ వస్తుంది. కిలో కోడి ధర. ప్రస్తుతం రూ. 350 నుంచి 400 వరకు ఉంది. కోడి మార్కెట్ వెళ్లే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. నెలకు రూ. 15వేల వరకు ఆదాయం వస్తుంది.
-గుంటిపల్లి సాయిరాం, నంగునూరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News