Sunday, April 28, 2024

‘నాటు నాటు..’ అంటూ రెచ్చిపోయిన చరణ్, తారక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ సినిమా ’ఆర్ఆర్ఆర్‘. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ’ఆర్ఆర్ఆర్‘ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా నాటు నాటు అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో చరణ్, తారక్ డ్యాన్స్ ఇరగదీశారు. ఈ సాంగ్ థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు టీజర్స్, ఒక సింగిల్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖనీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

NATU NATU Mass Song Released from RRR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News