Monday, April 29, 2024

భారత్-నేపాల్ మధ్య బస్సు సర్వీసు పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

India Nepal Bus Service
సిలిగురి: కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆగిపోయిన బస్సు సర్వీసు తిరిగి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి నేపాల్‌లోని కాఠ్మండుకు పునరుద్ధరించబడింది. 45 మంది కూర్చునే బస్సు మంగళవారం మధ్యాహ్నం సిలిగురి బస్ టర్మినస్ నుంచి కొంత మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సు కకర్విట, లాల్‌గఢ్, నౌబిస్ గూండా కాఠ్మండుకు చేరుతుందని సిలిగురి బస్ యజమానులు, బుకింగ్ ఏజెంట్ల సంఘం తెలిపింది. ప్రయాణికులు అన్ని ప్రోటోకాల్స్ పాటించి మరి ప్రయాణిస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు సంతోష్ షా తెలిపారు. సిలిగురి నుంచి కాఠ్మండుకు బస్సు సర్వీసు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరుతుంది. టిక్కెటు ధర రూ. 1500. దీంతో టూర్ ఆపరేటర్లు పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News