Sunday, April 28, 2024

ఆగస్టు 17నుంచి నేపాల్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు..

- Advertisement -
- Advertisement -

Nepal to resume domestic and International flights from Aug 17

ఖాట్మండు: నేపాల్‌లో కరోనా కారణంగా నాలుగు నెల్ల ఆగిపోయిన జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగస్టు17న తిరిగి ప్రారంభం కానున్నాయి. దేశంలో కరోనా కేసులు నెరిగిపోతుండడంతో నేపాల్ ప్రభుత్వం గత మార్చి 20న నేపాలీలు సహా అన్ని దేశాల ప్రయాణికులు తమ దేశంలో ప్రవేశించడంపై నిషేధం విధించింది. ఆ తర్వాత నాలుగు రోజులకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. అయితే ఇప్పుడు దేశంలో కరోనా కేసులు బాగా తగ్గినందున ఆగస్టు 17నుంచి జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు నేపాల్ న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శివ మాయ తుంబహంగ్పే ‘ఖాట్మండు పోస్ట్’ పత్రికకు చెప్పారు.

నేపాల్‌లో సోమవారం కొత్తగా 186 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17,844కు చేరుకోగా, ఇప్పటివరకు వైరస్‌తో 40 మంది చనిపోయారు. చాలా దేశాలు ఇప్పటికే కరోనా ఆంక్షలను ఎత్తివేస్తుండడంతో తిరిగి విమాన సరీసులను ప్రారంభిస్నుట్లు ప్రభుత్వం చెబుతోందని ఆ పత్రిక పేర్కొంది. సరిహద్దులు మూసివేయడంతో పాటుగా అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించడంతో ఒకప్పుడు మూడు పువ్వులు, ఆరుకాయలుగా ఉన్న నేపాల్ పర్యాటక రంగం కుప్పకూలే దశకు చేరుకుంది. ఇప్పట్లో ఈ రంగం కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తిరిగి విదేశీ టూర్ ఆపరేటన్లు, పర్యాటకుల్లో విశ్వాసాన్ని కలిగించడానికి ప్రభుత్వం, పరిశ్రమలోని అన్ని వర్గాలు చేయాల్సింది చాలా ఉందని పర్యాటక రంగ పారిశ్రామికవేత్త యోగేంద్ర సాక్య అభిప్రాయపడ్డారు.

Nepal to resume domestic and International flights from Aug 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News