Monday, April 29, 2024

సెల్‌ఫోన్ల తయారీకి కొత్త పథకం: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

Manufacturing

న్యూఢిల్లీ : సెల్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రతిపాదించారు. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్‌లో పెట్టుబడుల్ని ఆకర్షించాలని ఆమె అన్నారు. ప్రతి జిల్లాను ఒక ఎగుమతి హబ్ కావాలని, అదే ప్రభుత్వ దృక్పథమని ఆమె అన్నారు.

రాష్ట్ర స్థాయిలోనే క్లియరెన్స్‌లు పొందే సదుపాయాన్ని కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని , పెట్టుబడులపై ఉచిత సలహాలిచ్చేందుకు క్లియరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతిచోటా ‘సాగర్ మిత్ర’ ద్వారా గ్రామీణ యువతను ప్రోత్సహిస్తామని, మత్స పరిశ్రమను విస్తృతపరిచేందుకు 500 మత్సకారుల సంఘాలను నెలకొల్పుతామని నిర్మల చెప్పారు. 2025 నాటికి పాల ప్రాసెసింగ్ సామర్థం రెట్టింపు అవుతుందని ఆర్థికమంత్రి చెప్పారు.

new scheme for manufacturing cell phones

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News