Monday, April 29, 2024

రామేశ్వరం కేఫ్ నిందితుడి ఆచూకీ తెలిపితే.. రూ. 10 లక్షల బహుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్న నిందితుడి ఆచూకీ తెలియచేసిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) బుధవారం ప్రకటించింది. తలపై క్యాప్, ముఖానికి మాస్కు, కూలింగ్ గ్లాసెస్ ధరించి కేఫ్‌లోకి ప్రవేశిస్తున్న అనుమానితుడి ఫోటోను తన అధికారిక ఎక్స్(ఇదివరకటి ట్విట్టర్) హ్యాండిల్‌లో ఎన్‌ఐఎ పోస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అందచేయడానికి ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ అడ్రస్‌లను ఎన్‌ఐఎ షేర్ చేసింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్‌ఐఎ హామీ ఇచ్చింది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును ఈ వారం మొదట్లో ఎన్‌ఐఎకు అప్పగించారు.

బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఇడి) ద్వారా ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు(నిరోధక) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తునకు సంబంధించి ఎన్‌ఐఎకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. 26/11 ముంబై ఉగ్ర దాడులను పురస్కరించుకుని 2008లో ఎన్‌ఐఎ ఏర్పాటు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News