Monday, April 29, 2024

జూబ్లీహిల్స్ లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులు ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. యువతులను ఆకర్షిచేందుకు ‘అవని వెల్‌నెస్ సెంటర్’ పేరు ముసుగులో శైలజ, పరమేశ్వర్ అనే దంపతులు వేశ్య గృహాన్ని నడుపుతూ ఆన్‌లైన్ సెక్స్ బిజినెస్ చేస్తున్నారు. వీరు నార్త్ ఇండియా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్ పేరుతో లోకాంటో వెబ్ సైట్‌లో యువతుల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు. తన మొబైల్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో పెట్టి ఫోన్ చేసిన వారికి వివరాలు తెలుపుతోంది. తనకు సాయంగా గద్వాలకు చెందిన చందా వనజశ్రీని నియమించుకుంది. ఆమె ద్వారా కూడా విటులను ఆకర్షిస్తోంది. ఆమెకు నెలకు రూ.10,000 ఇస్తోంది. విటులు ఆలీ, రాజు రెడ్డి, నిర్వాహకురాలితోపాటు ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకురాలి భర్త పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.

Online Sex Racket busted by Jubilee Hills Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News