Monday, April 29, 2024

కోర్టు ఆదేశాలతో క్యాబినెట్‌లో మార్పులు చేసిన పాక్ ప్రధాని

- Advertisement -
- Advertisement -

Pak PM reshuffles Cabinet on court's directive

ఇస్లామాబాద్: ప్రజలు ఎన్నుకోని సలహాదారులు, ప్రత్యేక సహాయకులు క్యాబినెట్ కమిటీలకు సారథ్యం వహించడాన్ని నిషేధిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేయడంతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు. 2018లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ అధికారాన్ని చేపట్టిన తర్వాత క్యాబినెట్ పునర్వవస్థీకరణ జరగడం ఇది నాలుగవసారి. ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో మార్పులు చేపట్టారు. దేశ ఆంతరంగిక మంత్రిగా షేక్ రషీద్ అహ్మద్‌ను నియమించగా ఆర్థిక మంత్రిగా డాక్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్‌ను నియమించారు. అహ్మద్ ఇప్పటి వరకు రైల్వే శాఖ మంత్రిగా ఉండగా హఫీజ్ షేక్ ఆర్థిక, రెవెన్యూ శాఖల సలహాదారుగా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కాని హఫీజ్ షేక్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 91(9) కింద మంత్రిగా నియమించారు. ఆయన పదవీకాలం ఆరు నెలలు ఉంటుంది. ఈ లోపల ఆయన జాతీయ అసెంబ్లీకి లేదా సెనేట్‌కు సభ్యుడిగా ఎన్నిక కావలసి ఉంటుంది. కాని పక్షంలో ఆయన పదవిని కోల్పోతారు.

Pak PM reshuffles Cabinet on court’s directive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News