Monday, April 29, 2024

నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి.. పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

Panjagutta Steel Bridge Open Today

హైదరాబాద్: ట్రాఫిక్ నివారణే లక్ష్యంగా పంజాగుట్ట బంజారాహిల్స్ మార్గంలో పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద రూ.5.95 కోట్లతో నిర్మించిన స్టీల్‌బ్రిడ్జిను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించనున్నారు. పంజాగుట్ట శ్మశానవాటిక చట్నీస్ మధ్య రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంతో ఈ మార్గంలో తరుచు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దీంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో భాగంగా ఎస్‌ఆర్‌డిపి కింద రూ. 23కోట్ల వ్యయంతో చట్నీస్ వైపు స్టీల్‌బ్రిడ్జి నిర్మాణంతో పాటు శ్మశాన వాటిక వైపు రెండు లేన్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు.

ఇందులో భాగంగా గత ఫిబ్రవరి 29న ప్రారంభమైన స్టీల్‌బ్రిడ్జి పనులు మే చివరినాటికి పూర్తి కాగా, చట్సీస్ వైపు అప్రోచ్ రోడ్డు పనులు ఇటీవల పూర్తి చేశారు. దీంతో శుక్రవారం స్టీల్ బ్రిడ్జిను హోంమంత్రి మహముద్ అలీ ప్రారంభించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థ్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

లాక్‌డౌన్‌తో త్వరితగతిన పనులు పూర్తి

వేలాది వాహనాలతో నిత్యం కిటకిటలాడే పంజాగుట్ట -బంజారాహిల్స్ మార్గంలో పంజాగుట్ట శ్మాశనవాటిక చట్నీస్ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్డు విస్తరణకు సంబంధించి శ్మాశన వాటిక ఉండడంతో గతంలో ఈ రోడ్డును విస్తరించేందుకు వీలు కాకపోవడంతో సుదీర్ఘ కాలంగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అనేక సమస్యలను ఎదుర్కోంటున్నారు. దీంతో శ్మాశనవాటికకు ఏ మాత్రం నష్టం కలుగకుండా ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా 100 మీటర్ల పొడవునా 9.60 మీటర్ల వెడల్పుతో రెండు లేన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి గత ఫిబ్రవరి 29వ తేదీన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మొత్తం రూ.23 కోట్ల వ్యయంతో 100 మీటర్ల స్టీల్ బ్రిడ్జి (రూ.5 కోట్లు) నిర్మాణ పనులతోపాటు కెబిఆర్ పార్కు వైపు 22 మీటర్లు, ఎన్‌ఎఫ్‌సిఎల్ వైపు మరో 35 మీటర్ల పొడవు మొత్తం మరో 57 మీటర్ల అప్రోచ్ రోడ్డును నిర్మించారు.

అంతేకాకుండా స్టీల్ బ్రిడ్జిపై ఒక మీటరు వెడల్పుతో ప్రత్యేకంగా ఫుట్ పాత్‌ను సైతం ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రిడ్జిను నిర్మించారు. ఈ పనులను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, పశుసంవర్థ్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులను దిశా నిర్దేశం చేశారు. కరోనా వైరస్ కారణంగా గత మార్చి 22న లాక్‌డౌన్ విధించడం, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని రికార్డు స్థాయిలో పనులు పూర్తి అయ్యేలా మంత్రులు చర్యలు చేపట్టారు. ఈ కీలకమైన మార్గంలో స్టీల్ బ్రిడ్జి నేటి నుంచి అందుబాటులోకి రానుండడంతో టివి9 జంక్షన్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు వాహనాల రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగనుండడంతో ప్రయాణికులకు సమయం కలిసిరానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News