Monday, April 29, 2024

రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు

- Advertisement -
- Advertisement -

Ration-Shops

హైదరాబాద్: గ్రేటర్‌లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి రేషన్ షాపులు ముందు వేచిచూడాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. సరుకులు కోసం తమ పిల్లలను ఒక రోజు బడి మాన్పించి ఉంచుతున్నామని పేర్కొంటున్నారు. ఆరు ఏళ్ల కితం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్దలో అక్రమాలు అడ్డుకట్ట వేసి నల్లా బజారుకు తరలించకుండా ఉండేందుకు ఈపాస్ యంత్రాలను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి డీలరు బయోమెట్రిక్ సేవలు వినియోగిస్తూ రేషన్ అందజేస్తున్నారు.

ఇంటర్‌నెట్ సేవల్లో అంతరాయం ఉండటంతో ముషీరాబాద్, అంబర్‌పేట, కాచిగూడ, మలక్‌పేట,సైదాబాద్, సరూర్‌నగర్, ఉప్పల్ వంటి ఏరియాల్లో ఈపాస్ మొరాయించడంతో లబ్దిదారులు సరుకులు తీసుకోకుండా వెనుదిరిగి పోతున్నారు. ప్రతి నెల 20శాతం పైగా కుటుంబాలు రేషన్ సరుకులు తీసుకోలేదని డీలర్లు పేర్కొంటున్నారు. నూతన టెక్నాలజీ ద్వారా ఈపాస్ యంత్రాలతో సరుకులు అందజేస్తున్న, ఇంటర్‌నెట్ సేవల్లో అంతరాయం కారణంగా యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది కార్డుదారులు ఆపాస్ మిషన్లఆలస్యంపై మండిపడుతున్నారు. కొంతమంది వినియోగదారులకు సంబంధించిన వేలిముద్రలు మ్యాచికాకపోవడంతో మరిన్ని చిక్కులు ఎదుర్కొంటున్నామని, బస్తీలకు చెందిన ప్రజలు చాలామంది కార్మికులు కావడంతో వారి వేలిముద్రలు కనిపించకపోవడంతో ఆపాస్‌యంత్రాలో చేతివేలు పెడితే స్పందించడం లేదు.

చాలామంది లబ్దిదారులు వారి పిల్లలను తీసుకొచ్చి సరుకులు తీసుకునే దుస్దితిని నెలకొంది. ప్రభుత్వం ఈపాస్ యంత్రాల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఆదార్ డేటాతో కూడిన సమాచారాన్ని యంత్రాల్లో పొందుపరుతారు. ఆపాస్‌లో ఇంటర్‌నెట్ కోసం బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, టాటా సంస్దల నుంచి తీసుకున్నారు. మూడు సంస్దలకు సంబంధించిన ఏదో ఒక దాని సిగ్నల్ ఉంటుందని తీసుకుంటే అవి సక్రమంగా పనిచేయడంలేదు. వీటిలో సాంకేతిక లోపం ఏర్పడితే ఆయా సంస్దల ప్రతినిధులు వచ్చి మరమ్మత్తులు చేయాలని, కానీ వారు పట్టించుకోవడంలేదని డీలర్లు ఆరోపిస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో 09 సర్కిల్ పరిధిలో 1545 రేషన్ దుకాలుండగా, వీటి ద్వారా 11.10 లక్షలఆహారభద్రత కార్డులు, లబ్దిదారులకు 43.42 లక్షల యూనిట్లు, నెలసరి బియ్యం కేటాయింపు 28వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. ప్రతినెల 15వరకు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంటాయి. అధికారులు గణాంకాల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 5,86,519 కార్డులకు సరుకులు తీసుకున్న కార్డులు 3,68, 210, రంగారెడ్డి జిల్లాలో 5,25,115 రేషన్‌కార్డులకు 4,05,008 కార్డులు సరుకులు పొందినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈపాస్ యంత్రాలతో పాటు మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా చూసి రేషన్ సరుకులు పంపిణీలో సమస్యలు లేకుండా చూడాలని డీలర్లు సూచిస్తున్నారు.

People Face Problems Due To e pass machines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News