Saturday, April 27, 2024

‘పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలి’

- Advertisement -
- Advertisement -

green india challenge

 

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ రఘు బొడ్డుపల్లి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి SYNCHRONY INDIA కార్పొరేట్ హెడ్ వెంకట్ టంక శాల కొండాపూర్‌లోని టెంపుల్ పార్క్‌లో మంగళవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ దేవరాజన్ దివ్య, సంధ్యా రాణి కానేగంటి, మయూర్ పట్నాల ( కో -ఫౌండర్, నిర్మాణ్), సూజీ బూర్లు ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

మొక్కల సంరక్షణ బాధ్యతగా స్వీకరించాలి: సునీతవిజయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇతర దేశాల్లో వివిధ ప్రముఖులు ఛాలెంజ్ స్వీకరించి ప్రచారం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సునీతవిజయ్ గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి మంగళవారం ఆక్లాండ్ లోని తమ స్వగృహంలో కెల్స్టోన్ పార్లమెంటరీ నియోజకవర్గ జాతీయ పార్టీ (నేషనల్) చైర్‌పర్సన్ బాల వేణుగోపాల్ రెడ్డి బీరంతో కలిసి పలు మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను, వారసత్వ బాధ్యతగా స్వీకరించాలని కుమార్తె త్రిష రెడ్డికి సూచించారు.

హైదరాబాద్ నుంచి తమ కుటుంబం ఇక్కడకు వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు అయ్యిందని, ఇటీవల హైదరాబాద్ వెళ్లినప్పుడు, హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, కీసర ప్రాంతం అరకును తలపిస్తోందన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను యువత, ముందుకు తీసుకెళ్లి, అనుకున్న పది కోట్ల మొక్కల లక్ష్యాలను త్వరలో చేరుకోవాలని అభిలషించారు. న్యూజిలాండ్ దేశంలాగే త్వరలో పచ్చదనంతో నిండి హరిత తెలంగాణగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మురళి అన్ను, షాలిని వాధ్వాన్, వినోద్ పటేల్‌లకు సునీతవిజయ్ గ్రీన్‌ఛాలెంజ్‌ను విసిరారు.

Plants should be planted for environmental protection
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News