Sunday, April 28, 2024

ధరలకు రెక్కలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడి పాలనలో వంటనూనెలు మండుతున్నాయి. పప్పుల ధరలు వేగిపోతున్నాయి. ఉప్పుతో సహా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు మొలుస్తున్నాయి. సామన్య , మధ్యతరగతి కుటుంబాలకు అందనంత ఎత్తుకు పెరిగిపోతున్నాయి. పసిపిల్లకు పౌష్ఠికాహారంగా అందించే పాలు , పాల ఉత్పత్తుల ధరలు సైతం పొంగులు బారుతున్నాయి. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా కమాడిటి ట్రేడర్స్ నుంచి జిఎస్టీని దుండుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగులకు తాము కారణం కాదని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. రష్యా ఉక్రేయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నరేంద్ర మోడి సర్కారు బూచిగా చూపుతోంది.

నిత్యావసర సరుకుల మార్కెట్‌లో ధరల పెరుగుదల సూచిని పరిశీలిస్తే రష్యాఉక్రేయిన్ యుద్దం కంటే ముందు నుంచే నిత్యావసర సరుకుల ధరలు పెరుగూ వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఒక పక్క డాలర్ విలువ పెరిగిపోతుంటే మరోపక్క రూపాయి విలువ వేంగంగా క్షీణిస్తోంది. 2018లో డాలర్ విలువతో పొలిస్తే రూ.64.80 ఉండగా ఇది 2021నాటికి రూ.74కు క్షీణించింది. ఇప్పుడు ఏకంగా రూ.83కు క్షీణించి పోయింది. రూపాయి పతనం కూడా మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగేందుకు బలమైన కారణంగా ఆర్ధిక రంగం నిపుణులు చెబుతున్నారు.

వంటనూనెలు సలసల 

ఎన్డీఏ పాలనలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా వంట నూనెల ధరలు సలసల కాగిపోతున్నాయి. 2018నుంచి 2022 మధ్య అన్ని రకాల వంటనూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. 2018లో కిలో పొద్దుతిరుగుడు నూనె ధర రూ.96.28 ఉండగా, నాలుగేళ్లలోనే దీని ధర వరుసగా రూ.99.84, రూ.144.23, రూ.164.36కు చేరి 2022నాటికి రూ.178.2కు పెరిగిపోయింది. కేవలం నాలుగేళ్లలోనే కిలోకు రూ.82కు పెరిగిపోయింది. అదే విధంగా పామాయిల్ ధర కూడా 2018లో రూ.76ఉండగా, ఇది 2022నాటికి 134రూపాయలకు పెరిగింది. సోయా నూనె ధరలు కూడా రూ.89.34నుంచి నాలుగేళ్లలో రూ.158కి పెరిగిపోయింది. దక్షిణాధి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉనియోగించే వేరుశనగ నూనె ధరలు కూడా అమాంతం పెరుగుతూ పోయాయి. 2018లో రూ.125నుంచి 2022కు రూ.189కి చేరింది. వనస్పతి సైతం రూ.80నుంచి రూ.150కి చేరింది.

దడపుట్టిస్తున్న దాల్ ధరలు ..

ప్రధాని నరేంద్రమోడి పాలనలో దాల్ ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. 2018లో ఉర్దూదాల్ ధర కిలో రూ.70నుంచి 2022నాటికి రూ.106కు పెరిగిపోయింది. మూంగ్‌దాల్ ధర కిలో రూ.73నుంచి రూ.102కు పెరిగింది. మసూర్ దాల్ రూ.61నుంచి రూ.96కు చేరింది.టుర్ దాల్ రూ.71నుంచి రూ107కు , గ్రామ్‌దాల్ రూ.66నుంచి రూ.73కు పెరిగాయి. బియ్యం ,గోధుమల ధరలు సైతం ఇదే రీతిలో పెరిగిపోయాయి. బియ్యం ధర కిలో రూ.30నుంచి నాలుగేళ్లలో రూ.37కు పెరిగింది. గోధుమల ధర రూ.24నుంచి రూ.30కి పెరిగింది. చక్కర ధర కిలో రూ.38నుంచి 41కి పెరిగింది. టీపోడి ధర కిలో రూ.209నుంచి రూ.282కు పెరిగింది. కిలో ఉప్పు ధర కూడా రూ15నుంచి రూ.20కి పెరిగింది.

పసిపిల్లకు పౌష్టికాహరంగా అందించే పాల ధరలు సైతం పెరిగిపోతూనే ఉన్నాయి. 2018లో లీటరు పాల ధర రూ.43ఉండగా 2022నాటికే వీటి ధర రూ.52కు పెరిగిపోయింది. వంటనూనెలు , ఇతర నిత్యాసర సరకుల ధరల పెరుగుదలపై రాజ్యసభలో సభ్యులడిగిన ప్రశ్నలకు ఈ నెల 10న కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక సమాధానంగా 20182022మధ్య కాలానికి దేశమంతటా పెరిగిన ధరల వివరాలను వెల్లడించింది. 2023లో నిత్యావసర సరుకుల ధరలు ఈ రెండు నెలల్లో మరింత పెరిగాయి. ఉదాహరణకు పాల ధరలోనే లీటరు పాలు రూ.60కి పెరిగిపోయాయి. వంటనూనెలు, పప్పులు , ఇతర నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News