Thursday, May 16, 2024

కరోనా పేరిట ప్రేవేటు ఆస్పత్రి దోపిడి..

- Advertisement -
- Advertisement -

Private Hospitals collect heavy bills from Corona Patients

హైదరాబాద్: ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభణ, మరోపక్క అదే కరోనా పేరుతో ప్రైవేట్, కార్పోరేట్ ఆస్ప్తత్రులు లక్షల్లో బిల్లులు వసూళ్లు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే.. అంతే సంగతి. కరోనా వచ్చిందని లక్షలకు లక్షలు బిల్లులు వసూళ్లు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే మియాపూర్ లో మదీనగూడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దగ్గు, ఆయాసంతో బాధపడుతూ ఈ నెల 16వ తేదీ రాత్రి శంకర్ మఠ్ కు చెందిన 72 సంవత్సరాల వ్యక్తి పేస్ ఆసుపత్రిలో చేరాడు. చేరిన వెంటనే 50 వేలు కట్టించుకున్న ఆస్పత్రి సిబ్బంది.. ఆ తర్వాత రోజుకు లక్ష చొప్పున బిల్లు వేశారు.

చిన్న చెప్పుల షాపు నడిపించుకునే ఆ వ్యక్తి కుటుంబం అప్పు చేసి లక్ష రూపాయలు చెల్లించారు. ఇన్ని డబ్బులు కట్టలేమని, తాము గాంధీ ఆసుపత్రికి వెళతామని చెబితే మరో మూడు లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి సిబ్బంది అంటుందని, ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి ఏమి చెప్పలేదని.. వీడియోలో కళ్ళు మూసుకుని ఉన్నది మాత్రమే ఒక్కసారి చూపించారని పేషెంట్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పేషేంట్ వెంటిలేటర్ పై ఉంటే 9వేలు మాత్రమే వసూళ్లు చేయాలని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తే మాకు అలాంటి ఉత్తర్వులు వర్తించవని, ఆ ధరల్లో మేము చికిత్స చేయలేమని  ఆసుపత్రి సిబ్బంది అంటున్నారని వారు తెలిపారు.

Private Hospitals collect heavy bills from Corona Patients

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News