Monday, April 29, 2024

రైల్వే కార్మికుల రిలే నిరాహార దీక్షలు

- Advertisement -
- Advertisement -

కాజీపేట : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో రైల్వే కార్మికులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. నాలుగు రోజుల రిలే నిరాహార దీక్షలను సోమవారం నాడు కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు వెంకట్ నారాయణ రైల్వే కార్మికులకు పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ దీక్షలు 11 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కేంద్ర కమిటీ సభ్యుడు చింతా మురళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పెన్షన్ విధానం అనేది ఉద్యోగస్తుల సామాజిక పద్ధతిని దెబ్బతీస్తుందని, ఇది పదవీ విరమణ తర్వాత జీవితానికి భరోసా లేకుండా పోతుందన్నారు.

వెంటనే తీసివేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి జిల్లా సెక్రెటరీ, లోకో రన్నింగ్ బ్రాంచ్ వర్కింగ్ చైర్మన్ పాక రాజ్ కుమార్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఎవరైతే మానిఫెస్టోలో పెడతారో వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉంటుందని తెలియజేశారు. నిరాహార దీక్షలో 80 మంది యువ కార్మికులు కూర్చున్నారంటే పాత పెన్షన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట బ్రాంచ్ సెక్రటరీ నర్సింగరావు, ఆపరేటింగ్ బ్రాంచ్ సెక్రటరీ ముస్తాక్ హుస్సేన్, వర్కింగ్ చైర్మన్ నారాయణ, కె.రవి, వరప్రసాద్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఏకాంబరం, బల్వీందర్ సింగ్, అజీజ్ పాషా మరియు కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News