Wednesday, May 1, 2024

అందుకే ‘అరణ్య’ చేశాను

- Advertisement -
- Advertisement -

రానా దగ్గుబాటి హీరోగా ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అరణ్య’. ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈనెల 26న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో రానా దగ్గుబాటి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అందుకే ఒప్పుకున్నా…
ఈ సినిమా డైరెక్టర్ ప్రభు సాల్మోన్ తీసిన ‘కుమ్కి’ కథలో ఏనుగు ఒక పార్టు మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఏనుగులు, అడవులు గురించి బాగా పరిశోధన చేసిన ప్రభు ‘అరణ్య’ కథను సిద్ధం చేశారు. ఏనుగుల నేపథ్యంలో కొనసాగే ఈ సినిమా చేయాలనిపించి ‘అరణ్య’ చిత్రానికి ఒప్పుకున్నాను.
ప్రత్యేక శిక్షణ…
ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజులు ముందుగానే థాయ్‌లాండ్‌కు వెళ్లాం. అక్కడి అడవుల్లో మాకు కావాల్సిన లొకేషన్స్ కోసం వెతికాము. ఏనుగుల పార్క్‌లలో షూటింగ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ కథ గురించి ప్రభు చెప్పినప్పుడు 18 ఏనుగులతో షూట్ చేయాల్సి ఉంటుంది అన్నారు. అందుకే ముందుగా ఏనుగులతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ఏనుగుల సంరక్షకుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా ఒక ఏనుగు మన పక్కన నడిస్తేనే భూమి కంపిస్తుంది. అలాంటిది ఒకేసారి 18 ఏనుగులు మీ వెనుక నడుస్తూ ఉంటే ఆ విజువల్ ఊహించుకోండి. ఇది విభిన్నమైన అనుభూతినిచ్చింది.
యాక్షన్ సీన్స్ వైల్డ్‌గా…
ఈ సినిమాలోని నా లుక్ కోసం ప్రభు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ పరంగా నా చేతిలో ఉన్న కర్ర, అడవిలో కనిపించే కుందేలు, జింక ఇతర జీవాలు కూడా సినిమాలో చిన్న క్యారెక్టర్స్‌గా కనిపిస్తాయి. మేజర్‌గా ఇది ఏనుగుల కథ. షూటింగ్‌లో పాల్గొన్న ప్రతిరోజూ ఏనుగుల దగ్గర నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయి.
అందుకే ‘అరణ్య’ టైటిల్…
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు నరేంద్రభూపతి. ‘ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ బిరుదు వచ్చాక అందరూ అతన్ని అరణ్య అని పిలుస్తుంటారు. అందుకే ఈ సినిమాకు ‘అరణ్య’ టైటిల్ పెట్టాము.
కొత్త అనుభూతి…
ఈ సినిమాను మొత్తం ఆరు అడవుల్లో చిత్రీకరించాము. ఒక షాట్ థాయ్‌లాండ్ ఎలిఫెంట్ ఫార్క్‌లో తీస్తే ..ఆ షాట్ కంటిన్యూషన్ కేరళ అడవుల్లో ఉంటుంది. మరో షాట్ కంటిన్యూషన్ మహాబళేశ్వరంలో కనిపిస్తుంది. థియేటర్స్‌లో ‘అరణ్య’ సినిమా చూసేప్పుడు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది.

Rana Daggubati Interview about ‘Aranya’ Movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News