Sunday, April 28, 2024

చేనేత రంగంపై విధించిన పన్ను విధానాన్ని పునః పరిశీలించాలి…

- Advertisement -
- Advertisement -

Reconsidered on handloom sector tax

మనతెలంగాణ/హైదరాబాద్: నూలు, రంగులు, మరమగ్గాలు, చేనేత ఉత్పత్తుల వంటి ముడి పదార్థాలపై భారం మోపుతున్నారని,చేనేత రంగంపై విధించిన పన్ను విధానాన్ని పునః పరిశీలించాలని క్రియేటివ్ బీ సహ వ్యవస్థాపకులు బినారా రావు పేర్కొన్నారు. నగరంలోని జూబ్లీ హిల్స్‌లో జరిగిన రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్, ఫిల్మ్ అండ్ మీడియా చొరవతో వీవ్ ఇండియాలో శనివారం నాడు జరిగిన ఫ్యాషన్ డిజైనర్లు, డిజైన్ స్టూడెంట్స్, వీవర్స్, హ్యాండ్‌లూమ్ ఫ్యాబ్రిక్‌లు నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రియేటివ్ బీ సహ వ్యవస్థాపకులు బినారా రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎగుమతి ప్రక్రియను సులభతరం చేయాలని, విదేశీ వాణిజ్య కార్యాలయం భారతదేశం నుండి ఎగుమతులకు వ్యతిరేకంగా విదేశీ చెల్లింపులను స్వీకరించడానికి సరళమైన నిబంధనలను కలిగి ఉండాలన్నారు. చేనేత ఉత్పత్తులను విక్రయించడానికి, ప్రపంచమే మార్కెట్ ఒక చక్కని అవకాశమని, మన చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి కార్పొరేట్ సంస్థలు తమ సిఎస్‌ఆర్ నిధులను ఉపయోగించాలన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని తానే భారత ప్రభుత్వానికి సిఫార్సు చేశానని, దాన్ని విస్తృతంగా పాటిస్తున్నందుకు అభినందనీయమన్నారు. శ్రావణ్ స్టూడియో ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అనేక దేశాలకు భిన్నంగా బట్టలు నేయడం భారతదేశానికి ఇప్పటికీ సంప్రదాయంగా ఉందన్నారు. అనంతరం

రూట్స్ కొలీజియం ఛైర్మన్ బిపి పడాల మాట్లాడుతూ చేనేత భారతదేశ సాంస్కృతిక వారసత్వమని ఈ రంగంలోని 70% మంది నేత కార్మికులు , అనుబంధ కార్మికులుగా ఉన్నారన్నారు. ప్రత్యేకించి మహిళలకు ఇది జీవనోపాధికి ఒక ముఖ్యమైన మూలమన్నారు. వీవ్ ఇండియా నేత కార్మికుల ప్రదర్శనలో వెంకటగిరి, మంగళగిరి, నారాయణపేట, గొల్లభామ, గద్వాల్, కళంకారి నుండి వీవర్లు పాల్గొంటారని, పశ్చిమ బెంగాల్ నుండి ముస్లిన్ నేత కార్మికులు కూడా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేతలలో స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా నేత కార్మికుల చేనేత ఉత్పత్తులకు మద్దతు ఇద్దామన్నారు. 1905లో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటామని, చేనేత మన వారసత్వం అని ప్రజలకు తెలియజేయడానికి వీవ్ ఇండియా కృషి చేస్తోందన్నారు.ఈక్రమంలో రూట్స్ కళాశాల విద్యార్థులు, వారి సిబ్బంది, కుటుంబ సభ్యులు, అతిథులతో పాటు సాధారణ ప్రజలు, వివిధ నేత కార్మికులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఫ్యాషన్ ప్రియులు, చేనేత ప్రేమికులు వీవ్ ఇండియాను సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News