Monday, April 29, 2024

రికార్డు సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే డివిజన్

- Advertisement -
- Advertisement -

Record was set by Secunderabad Railway Division

ఒకే రోజులో 6.76 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణ పనులు
ప్రస్తుతం మహబూబాబాద్, తాండూర్, బెల్లంపల్లి, మధిర
తదితర మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు

హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రికార్డు సృష్టించింది. ఒకే రోజులో 6.76 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టి దిగ్విజయంగా వాటిని పూర్తి చేసింది. ఇండియన్ రైల్వేలో ఏ డివిజన్ ఇప్పటివరకు ఇటువంటి ఘనతను సాధించలేదని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్ తన ప్రణాళికను సమన్వయంతో ఈనెల 24, 27వ తేదీల్లో మొత్తం 13.25 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధణను పూర్తి చేసింది. ఒకరోజు 6.50 కిలోమీటర్లు, మరుసటి రోజు 6.75 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేసింది. సికింద్రాబాద్ డివిజన్ ప్రతి ఏడాది సుమారు 130 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల పట్టాలను పునరుద్ధరిస్తోంది. ప్రస్తుతం మహబూబాబాద్, తాండూర్, బెల్లంపల్లి, మధిర తదితర మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టింది. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే జిఎం గజానన మాల్య అధికారులను, సిబ్బందిని అభినందించారు. వారు ఇదేమైన కృషిని కొనసాగించాలని ఆయన వారికి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News