Monday, April 29, 2024

కేంద్ర ప్రభుత్వ అవార్డు రేసులో రేగులచలక పంచాయతీ

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పల్లె ప్రగతి, నేషనల్ పంచాయతి అవార్డులను సైతం రఘునాథపాలెం మండలంలో ఇటీవల కొత్తగా ఏర్పడిన రేగులచలక పంచాయతి జిల్లాలోనే ఉత్తమ పంచాయతిగా అవార్డు పొందింది. సర్పంచ్ కొర్లపాటి రామారావు, ఉప సర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు, కార్యదర్శి సంగీత, మార్కెట్ డైరెక్టర్ నున్నా శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రతి రోజు పారిశుద్ద పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ అవార్డు రేసులో

ఇప్పటికే రెండు పర్యాయాలు జిల్లా స్థాయి అవార్డులు పొందిన నేపథ్యంలో ముచ్చటగా మూడవ సారి కేంద్ర ప్రభుత్వ అవార్డును పొందేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్, కార్యదర్శి “మన తెలంగాణ”కు తెలిపారు. తాజాగా జిల్లాలో జనాభా ప్రాతిపదికన మూడు విభాగాల్లో స్వచ్ఛ పర్యవేక్షణ అవార్డుకు జిల్లా స్థాయి అధికారులు మూడు గ్రామపంచాయతిలను గుర్తించి నివేదిక పంపారు.

ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా…
సర్పంచ్ కొర్లపాటి రామారావు
తమ గ్రామ పెద్దలు నున్నా శ్రీనివాసరావు సహాయ సహకారాలతో గ్రామ ప్రజలకు తన వంతు సేవ చేసేందుకు రాజకీయాల్లో వచ్చి సర్పంచ్ నయ్యానని రేగులచలక సర్పంచ్ కొర్లపాటి రామారావు తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు గ్రామ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు రామారావు తెలిపారు.

గ్రామాభివృద్ధే నా లక్షం…
ఉప సర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు
రాజకీయాలకు తావు లేకుండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్షమని ఉప సర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర రవాణ శాఖా మాత్యులు పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో డబుల్ రోడ్డు నిర్మాణం, వైకుంఠధామం, పల్లె ప్రకృతి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News