Sunday, April 28, 2024

కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే…గుడ్లు పీకి గోలీలాడ్తరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రా రంభించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మ హిళల సామాజిక భద్రత కోణంలో సంఘాల బలోపే తం, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ఈ పథ కం తీసుకొచ్చినట్లు చెప్పారు. మహిళా శక్తి పథకం ద్వా రా మహిళలకు వడ్డీలేని రుణాలు, వచ్చే 5 సంవత్సరాల్లో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందుతుందన్నారు. మహి ళా సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పనకు తోడ్పడుతోందని వివరించారు. స్వయం సహాయక సంఘాలను ఐఐటీ, ఐఐఎం, ఎస్‌బీఐ, ఆర్‌ఎంఏతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వశక్తి మహిళ సదస్సులో పాల్గొని ఆయన మహిళా సం ఘాల సూక్ష్మ వ్యాపార ప్రణాళికల అధ్యయనం, రుణా ల సిఫార్స్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వివరించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహిళా శక్తి సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోం ది ఒక మహిళ అని మేం గర్వంగా చెప్పుకుంటామన్నా రు. 10 సంవత్సరాల కెసిఆర్ పాలనలో మహిళా సంఘాలు దివాళా తీశాయని, అందుకే మా ఆడబిడ్డలు కంకణం కట్టుకుని ఎన్నికల్లో గత పాలకులను బండకేసి కొట్టారన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తమ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే కెసిఆర్, హరీశ్, కవిత, కెటిఆర్ కిరాయి ఇచ్చి ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేయవద్దని కుట్రలు పన్నుతున్నారని, ఎవరు అడ్డు వచ్చినా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తామని కుండ బద్దలు కొట్టారు. రూ.500లకే మహిళలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, గృహాలక్ష్మి పథకం ద్వారా పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి రామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించుకున్నామని, ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత మాదేనని, అప్పుడే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణగా మారుతుందన్నారు.

రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన స్వయం సహాయక సంఘాల మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, మహిళ బృందాలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వాన్ని పడగొడతామని మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం ఫామ్ హౌస్ లో చిందులు వేస్తోందని, ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చోవాలా రైతు బిడ్డ కూర్చో కూడదా అని నిలదీశారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కెసిఆర్, ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా వస్తే మా ఆడబిడ్డలు చీపురు కట్టలు మడతపెట్టి తరిమికొడుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానించిన మోడీ ఓట్లెలా అడుగుతారని, కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే మా ఆడబిడ్డలు మీ గుడ్లుపీకి గోలీలు ఆడుకుంటారని హెచ్చరించారు.

రాబోయే కొద్ది రోజుల్లో 10లక్షల మహిళ ఆడబిడ్డలతో కవాతు చేస్తామని,మా సైన్యం మీరే మా బలగం మీరేనని పేర్కొన్నారు. స్వశక్తి మహిళా సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటగా సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. స్వయం ఉపా ధి కేంద్రాలతో మహిళలు రాణిస్తున్న తీరు ను అభినందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను స్టాల్స్‌లో ప్రదర్శించారు. ఒక్కొక్క స్టాల్ ను సందర్శిస్తూ, ఉత్పత్తులకు సంబంధించి మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ప్రభుత్వం తమను ప్రోత్సహిస్తున్న తీరుపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే ఏర్పా ట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

స్వశక్తి మహిళా సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన 10 స్టాళ్లలో బంజారా ఉత్పత్తులు, సిషల్ ఆర్టికల్స్, నకా షి పెయింటిం గ్స్, డర్రిస్, మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్కూల్ యూనిఫామ్స్, టస్సార్ సారీస్, హ్యాండ్లూమ్స్, టై అండ్ డై క్లాత్స్, గొల్లభామ చీరలు, లెథర్ ఉత్పత్తులు, చెక్కబొమ్మల ఉత్పత్తులు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, పెంబర్తి బ్రాస్, మిల్లెట్ ఉత్పత్తులు, డిగ్గి పే పాయింట్, విఎల్‌ఈ పాయింట్, పశుమిత్ర, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఉడ్ క్రాప్ట్, హోమ్ ఫుడ్స్‌కు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. స్వయం ఉపాధితో పేదరికం నుంచి లక్షాధికారులుగా మారిన మహిళల స్పూర్తిని సిఎం ప్రశంసించారు. మహిళల ఆదాయాన్ని పేంచేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తాం: డిప్యూటీ సిఎం భట్టి
మహిళలకు తమ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తుందని,ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక సం ఘం లోని 18 నుంచి 60 ఏళ్ళ మధ్య మహిళలకి 10 లక్షల జీవిత భీమా కల్పిస్తామని, అ మెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ లాం టి ఈ కామర్స్ వెబ్ సైట్ లలో స్వయం సహాయక సం ఘాల ఉత్పత్తుల అమ్మకాలకు అవకాశం కల్పిస్తామని, మహిళా సంఘాలకు గ్రామాల్లోని పాఠశాలల్లో పారిశుధ్య, మధ్యాహ్నం భోజనం పథకం బాధ్యత అప్పగిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News