Monday, April 29, 2024

‘సీటీమార్’కు అద్భుతమైన స్పందన

- Advertisement -
- Advertisement -

హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “సీటీమార్ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు చెన్నై, నార్తిండియాలోనూ షోలు పడ్డాయి. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే ‘సీటీమార్’ ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇండియాలోనే మాస్ గేమ్ అయిన కబడ్డీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించాను. ‘బెంగాల్ టైగర్’ తర్వాత అంత మంచి డైలాగ్స్ ఈ సినిమాకు కుదిరాయని అందరూ అంటున్నారు. నాకు గత పదేళ్లలో ఇంత పెద్ద హిట్ రాలేదు” అని అన్నారు.

Sampath Nandi press meet about Seetimaar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News