Monday, April 29, 2024

2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

- Advertisement -
- Advertisement -

Rajeev swagruha plots

 

సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్
చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ
మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్‌షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది. సుమారు 4 వేల ఫ్లాట్లున్నాయని, వీటిని వేలం వేయడం ద్వారా సంస్థకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కార్పోరేషన్ యోచిస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పడింది. కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలోనూ రాజీవ్ స్వగృహ కార్పోరేషన్‌కు చెందిన ఫ్లాట్లను విక్రయించాలని నిర్ణయించిన విషయం విదితమే.

784 ఎకరాలకు విముక్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వాలు రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా 36 ప్రాజెక్టులను చేపట్టాయి. అయితే, తెలంగాణలోని భూములను తనఖా పెట్టి పలు బ్యాంక్‌ల నుంచి రూ. 1,000 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఈ రుణాన్ని తీర్చకపోగా వడ్డీలు రూ. 200 కోట్లుగా తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్ళ క్రితం బ్యాంక్‌లకు రూ. 1200 కోట్లు చెల్లించి తనఖాగా ఉన్న సుమారు 784 ఎకరాల భూమిని విడిపించారు. ఈ ఫ్లాట్లను గతంలో వేలం సందర్భంగా బుక్ చేసుకున్న లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సూచించారు.

మార్గనిర్దేశకాలపై కమిటీ దృష్టి
ఈ స్వగృహ ఫ్లాట్లతో పాటు ఇతర స్థిరాస్తులను కూడా వేలం వేయాలని అందుకు పాటించాల్సిన మార్గనిర్దేశకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించడంపై ఈ కమిటీ దృష్టిసారించింది. రూపొందించిన మార్గనిర్దేషకాలను ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతి లభించిన వెంటనే ఫ్లాట్ల వేలం ప్రక్రియను ప్రారంభించాలని కార్పోరేషన్ యాజమాన్యం భావిస్తున్నది. ప్రైవేట్ సంస్థల టౌన్‌షిప్‌లకు ధీటుగా ఈ ఫ్లాట్స్‌ను కార్పోరేషన్ ఆధునిక వసతులను కల్పించారు.

ఈ మేరకు మూడు పడక గదులు, డబుల్, సింగిల్ బెడ్ రూం ఫ్లాట్స్‌లకు ఆథునిక హంగులు కల్పించారు. అసంపూర్తిగా ఫ్లాట్స్‌ను కూడా మరమ్మతులు చేసి అధునికంగా రూపొందించారు. మరో వైపు టౌన్‌షిఫ్ పరిధిలోని కాంఫ్లెక్స్‌లలో తాగు నీరు, మురుగునీటి వ్యవస్థలతో పాటు అంతర్గత రహదారుల, విద్యుత్తు, లీఫ్టులు, పార్కులు, వాకింగ్ స్థలాలు, గ్రీనరీ పరిసరాలను అందుబాటులోకి తెచ్చారు. మంచి డిమాండ్ ఉన్న బండ్లగూడ, పోచారం టౌన్‌షిఫ్‌లను పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

బండ్లగూడ,పోచారం టౌన్‌షిఫ్ ప్రాజెక్టుల సంక్షిప్త సమాచారం:
ఈ టౌన్‌షిఫ్ ప్రాజెక్టుల పరిధిలో 2,746 ప్లాట్స్ నిర్మించారు. ఇప్పటికే 500లకు పైగా ఫ్లాట్‌లను విక్రయించారు. ప్రస్తుతం దాదాపు 1.250 ఫ్లాట్స్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్స్ 486, డబుల్ బెడ్ రూంలు 1,440, సింగిల్ బెడ్ రూంలు 720, సీనియర్ సిటిజన్‌లకు కూడా ప్రత్యేకంగా 100 ప్లాట్స్ సిద్ధం చేశారు. దాదాపు 30 ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈ ప్రాజెక్టు నాగోల్ క్రాస్ రోడ్డు , మెట్రోరైలు స్టేషన్(నాగోల్), బండ్లగూడ బస్సు డిపోకు సమీపంగా ఉన్నది. ఈ టౌన్ షిప్‌లో దాదాపు 4వేల ఫ్లాట్స్‌ను నిర్మించారు. ప్రస్తుతం విక్రయానికి దాదాపు 2 వేలకు పైగా ఫ్లాట్స్ సిద్ధం చేశారు. గతంలో 180 ఫ్లాట్స్ విక్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సంస్ఠలకు చేందిన ఉద్యోగులు ఈ ఫ్లాట్లపై ఆసిక్తిని చూపుతన్నారు.

Selling of Rajeev swagruha plots
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News