Monday, April 29, 2024

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సేవలు బాగాలేవని ప్రయాణికుడి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Services at Kachiguda railway station are not good

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో లోపభూయిష్ట సేవలపై హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు సరిగా లేవని, డిజిటల్ రిజర్వేషన్ చార్ట్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి వెంటనే స్పందించిన సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ స్టేషన్‌లో ఏర్పడిన సమస్యలపై చింతిస్తున్నామని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామినిచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలని మేనేజర్ డిఆర్‌ఎంకు ఆదేశాలు జారీ చేయగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు డిఆర్‌ఎం ఆదేశాలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News