Monday, April 29, 2024

కరోనా ప్రభావంతో తీవ్ర మానసిక సమస్యలు

- Advertisement -
- Advertisement -

Severe Psychological problems with Corona effect

 

యూనివర్శిటీ కాలేజి ఆఫ్ లండన్ అధ్యయనం వెల్లడి

లండన్ : కరోనా వైరస్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన వారు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నప్పటికీ సన్నిపాత జ్వరం, బాధాకరమైన ఒత్తిడి వంటి మానసిక సమస్యలను అనుభవించే పరిస్థితి ఏర్పడవచ్చని బ్రిటన్‌కు చెందిన యూనివర్శిటీ కాలేజి ఆఫ్ లండన్ అధ్యయనం వెల్లడించింది. ది లాన్సెట్ సైకియాట్రీ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురించారు. కొవిడ్19, సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) తదితర కరోనా వైరస్‌లతో ఆస్పత్రి పాలైన వారి నుంచి స్వల్ప, సుదీర్ఘకాల అధ్యయనాల ద్వారా వచ్చిన ఫలితాలతో ఈ అధ్యయనం సాగింది. కొవిడ్ 19 తో ఆస్పత్రి పాలైన వారిలో ప్రతి నలుగురిలో ఒకరు అస్వస్థత సమయంలో సన్నిపాత జ్వరంతో బాధపడే ఉంటారని తెలుసుకున్నారు. ఆస్పత్రి పాలైన వారిలో ఇది సాధారణంగా సంక్రమిస్తుందని వైద్యులకు తెలుసు. అయితే ఇది ప్రాణహానికి దారి తీస్తుందని లేదా ఎక్కువ కాలం ఆస్పత్రిలో ఉండవలసి వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

కొవిడ్ 19 బారిన పడి కోలుకున్న వారిపై ప్రభావం ఏమిటో ఇప్పటివరకు తెలియక పోయినా బాధాకరమైన ఒత్తిడి (పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ ) , దీర్ఘకాల అలసట,కుంగిపోవడం, ఆందోళన వంటి సుదీర్ఘకాల సమస్యలు వెంటాడుతుంటాయని సార్స్, మెర్స్ అధ్యయనాలు వల్ల తెలుస్తున్నాయి. అయితే అవి కొవిడ్ 19 కి వర్తించ వచ్చు లేదా వర్తించక పోవచ్చని పరిశోధకులు వివరించారు. కొవిడ్19 రోగులు చాలామందిలో ఎలాంటి మానసిక సమస్యలు ఉండక పోవచ్చు. వారిలో వ్యాధి తీవ్రమై ఆస్పత్రి అవసరమయ్యే వారిలో కూడా ఈ పరిస్థితి ఉండక పోవచ్చు. కానీ ఎక్కువ సంఖ్యలో అస్వస్థులైన వారిలో మానసిక ఆరోగ్యంపై ప్రపంచ పరిణామ ప్రభావాన్ని ఆలోచించ వలసి ఉందని అధ్యయన పరిశోధకులు జొనధన్ రోజెర్స్ (యుసిఎల్ ) అభిప్రాయ పడ్డారు.

కరోనా వైరస్‌తో ఆస్పత్రి పాలైన వారి మానసిక ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో దానిపై తమ విశ్లేషణ కేంద్రీకృతమైందని, ఏ విధంగా మానసిక పరిస్థితులు రోగ నిరూపణను అధ్వాన్నం చేస్తుందో లేదా కోలుకున్న వారు తిరిగి సాధారణ జీవితానికి దూరంగా ఎంతవరకు ఉంటున్నారో తెలుసుకోవడమే ప్రధాన లక్షంగా తమ అధ్యయనం సాగిందన్నారు. 65 అధ్యయన సమీక్షలను, ఇంకా సమీక్షించని తాజా ఏడు అధ్యయనాలను ఈ పరిశోధన విశ్లేషించింది. సంబంధిత మూడు అనారోగ్యాల్లో ఏదో ఒకటి ఉన్న దాదాపు 3500 మందిని పరిశోధకులు అధ్యయనం లోకి తీసుకున్నారు. తేలిక పాటి కేసులు కాకుండా ఆస్పత్రి పాలైన వారి నుంచే ఈ వివరాలు సేకరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News