Monday, April 29, 2024

‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు.. ఆఖరికి దేవుడికి కూడా.. ఖబడ్దార్‌‌’

- Advertisement -
- Advertisement -

Shyam Singha Roy Teaser Released

హైదరాబాద్‌: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘శ్యామ్ సింగరాయ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో నాని క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా.. ఖబడ్దార్‌‌’’ అంటూ నాని చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shyam Singha Roy Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News