Sunday, April 28, 2024

4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ సామర్థ్యం పెంపుకోసం సింగరేణి ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి థర్మల్ విద్యుత్ సామర్థాన్ని 4 వేల మెగావాట్లకు పెంచుకునేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది.అదే ప్రాంతంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. 800 మెగవాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుత్ ఉత్పత్త సామర్థాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోవాలని ఈ సంవత్సరమే ప్రారంభంలోనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తాజాగా 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో మరో 1200( 2600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొన్నేళ నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి ధర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా చివరి దశలో ఉన్న 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థం 8042.25 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ రామగుడంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా చివరి దశలో 1600(2800) మెగావాటర్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే 4200 మెగావాట్లకు పెరగుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థంతో సింగరేణి ,ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది.సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News