Monday, April 29, 2024

దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది

- Advertisement -
- Advertisement -

కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి
లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు
హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Singireddy Niranjan Reddy

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ బంద్‌కు అపూర్వ స్పందన లభించిందన్నారు. దేశం యావత్ రైతాంగం వెనుక నిలిచిందన్నారు. ఇదో అపూర్వ ఘటనగా ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారన్నారు. కేంద్రంపై రైతుల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనమే రైతు బంద్ సంపూర్ణ విజవవంతం అవ్వడానికి దోహడపడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అయితే భారత్‌బంద్… టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక్కప్పటి తెలంగాణ ఉద్యమాలను తలపించాయన్నారు. రైతుల మద్దతుగా రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్లపై బైఠాయించారన్నారు. దీంతో రోడ్లు, జాతీయ రహదారులన్నీ ధర్నాలతో దిగ్భందం అయ్యాయని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ- గద్వాల జిల్లా అలంపూరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై టిఆర్‌ఎస్ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టంపై రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహజ్వాలలు ప్రతిరూపమన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బెట్టుచేయడం మాని వెంటనే వెనక్కు తగ్గాలన్నారు. లేనిపక్షంలో రైతులే బిజెపిని పాతాళానికి తొక్కేస్తారన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 12 రోజులుగా ఢిల్లీ చుట్టూ లక్షలమంది రైతులు స్వచ్చందంగా నిరసనలు తెలుపుతున్నారు. వారికి మద్దతుగా ఇప్పుడు దేశం మద్దతు తెలుపుతున్నదన్నారు. -రైతులకు మద్దతుగా కొన్ని పార్టీలే ఆందోళన చేస్తున్నారని బిజెపి, ఎన్‌డియే ప్రభుత్వం చిత్రీకరించడం సరికాదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా 40 లక్షల మందికి రూ.3016, రూ.2016 చొప్పున ఆసరా ఫించన్లు ఇస్తున్నదన్నారు.- ఏటా 58 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లకు పైగా రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. – ఈ ఏడాది రూ. 1141.44 కోట్లు రైతుభీమా పథకం కింద ఒక కుంట భూమి ఉన్న రైతుకు కూడా ప్రీమియం చెల్లించి ఎల్‌ఐసి సంస్థతో భీమా చేయించిందన్నారు. – రైతు ఏ కారణం చేత మరణించినా పదిరోజులలో రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందుతాయన్నారు. అలాగే – కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ , గురుకులాలు, సన్నబియ్యం అన్నం వంటి అనేక పథకాలతో పీడిత ప్రజలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం

అండగా నిలిచిందన్నారు. – ఈ ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొంది బాగుపడిన వర్గాలను చూయించండని ఆయన సవాల్ విసిరారు. – తెలంగాణ ప్రభుత్వ పథకం రైతుబంధును కాపీ కొట్టి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి ఆరువేలు ఇస్తోదంన్నారు. కాని – రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పోలిస్తే కేంద్ర పథకం ఏ మూలకూ సరిపోదన్నారు. – కొత్తచట్టం రైతులకు మేలు చేస్తుందనుకుంటే సహకరించేవాళ్లమన్నారు. కానీ నష్టం జరుగుతుందని తెలిసి ఎలా సహకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర- మోడీ వ్యవహారం ఎల్లడు దున్నుకుంట పోతే .. మల్లడు పూడ్సుకుంట పోయిండు అన్నట్లుందన్నారు. సిఎం కెసిఆర్ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే పథకాలతో ముందుకుసాగుతుంటే .. మోడీ సర్కారు తిరోగమన దిశలో పోతుందన్నారు. –

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News