Monday, April 29, 2024

త్వరలో కరీంనగర్‌లో కెసిఆర్ మకాం

- Advertisement -
- Advertisement -

అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచన

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
వల వేసి కుందేళ్లను పడతారు.. పులిని ఎలా బంధిస్తారో సిఎం రేవంతే చెప్పాలి
మాజీ ఎంపి వినోద్ వ్యాఖ్యలు

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కరీంనగర్ కేంద్రంగానే వ్యూహరచన చేయబోతున్నారని, త్వరలోనే కరీంనగర్ షిఫ్ట్ అవుతున్నా రని…ఇక్కడే ఉండబోతున్నారని కరీంనగర్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీదని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనతే అని అన్నారు. రాష్ట్ర సాధన కోసమే బిఆర్‌ఎస్ పార్టీని స్థాపించామని, పదవుల కోసం కాదన్నారు. తమ పార్టీ అధినేత కెసిఆర్‌కు ఆది నుంచి కరీంనగర్ అండగా నిలిచిందన్నారు.

రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చామని, దేశంలోని 32 రాజకీయ పార్టీల దగ్గరకు తిరిగి, 28 పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చామని అన్నారు. రాజ్యాధికారం కోసం ఆనాడు టి ఆర్‌ఎస్ పార్టీని పెట్టలేదని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పార్టీని పెట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి ప్రత్యేక రాషాన్ని సాధించామనని పేర్కొన్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు..అబద్ధాల పునాదిపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశ్యం బిఆర్‌ఎస్‌కు లేదని…ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం వెంటనే ప్రభుత్వం జివోలు విడుదల చేయాలని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. వలవేసి కుందేళ్లను పడతారు కానీ…పులిని వల వేసి ఎలా పడతారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలియాలని వ్యాఖ్యానించారు.

పదేళ్ళలో తెలంగాణలో 24 గంటల క రెంటు, కోటి ఎకరాలకు కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణం చేసి నీళ్లిచ్చామని అన్నారు. మరోవైపు సం క్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేశామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును శిరసావహిస్తామని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడం లేదని, లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు దరఖాస్తులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. యాసంగి సీజన్ లో రైతులకు క్వింటాలుకు 500ల బోనస్ ఇస్తామని చెప్పారని, యాసంగి. పంటను ఏప్రిల్, మే మాసాల్లో విక్రయించగానే రైతులు ప్రభుత్వాన్ని బోనస్ డబ్బులు అడగడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల అమలు కోసం జిఒ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

2014 నుంచి 2019 వరకు తాను ఎంపిగా ఉన్న సమయంలో కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో కరీంనగర్ అభివృద్ధికి ఎంపి బండి సంజయ్ నయాపైసా తేలేదని అన్నారు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని అన్నారు. తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలంటే కేంద్రం నోరు మెదపలేదని, తీగలగుట్టపల్లి గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్‌లో కలిపితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర రోడ్డు నిధుల కింద రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసిందని, తెలంగాణలో 20 ఆర్‌ఓబిలు అడిగితే ఐదు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమ లాకర్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృఫష్ణా రావు, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News