Monday, April 29, 2024

జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం ఏకపక్షం

- Advertisement -
- Advertisement -

Special Package Commission formula is desperate loss to states

 

జిఎస్‌టి పరిహారం మొత్తం చెల్లించాల్సిందే
అప్పుగా రాష్ట్రం తీసుకునే ప్రసక్తే లేదు
రూ. 723 కోట్లు తక్షణమే విడుదల చేయండి
42వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి హరీష్‌రావు డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటి వర కు కౌన్సిల్‌లో ఏ నిర్ణయం జరిగినా అందరితో చర్చి ంచిన మీదటనే తుది నిర్ణయం తీసుకునేవారన్నారు. అందుకు విరుద్ధంగా నేటి సమావేశంలో సొంత నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సోమవారం 42వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరిగింది. దూరదృశ్య విధానం ద్వారా ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు పా ల్గొన్నారు. బిఆర్‌కె భవన్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా వల్ల అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు.

ఈ ప్యాకేజీ ఇవ్వడం వ ల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరదన్నారు. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 2.43 నుంచి శాతం నుంచి 2.13 శాతానికి తగ్గిందన్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి తెలంగాణకు రూ. 723 కోట్లు వన్ టైం గ్రాంటు కింద ఇవ్వాలని సిఫారసు చేసింద ని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సిఫారసులను ఇప్పటి వరకు కేంద్రం ఆమోదించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం మొత్తం పరిహారాన్ని కేంద్రం చెల్లించాలన్న డిమాండ్‌కు కట్టుబడి ఉందని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా గు ర్తు చేశారు. 1 లక్షా83 వేల కోట్ల జిఎస్‌టి పరిహార ం చెల్లించాల్సిన చోటు కేవలం పది లక్షల కొట్లు చెల్లిస్తామని, ఈ మొత్తానని రాష్ట్రాలే రుణం తీసుకోవాలని చెప్పి సమావేశాన్ని ఏకపక్షంగా ముగించిందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

తెలంగాణ మాత్రం కేంద్రమే ఈ మొత్తం పరిహారాన్ని అప్పుగా తీసుకుని చెల్లించాలన్న విషయానికి ఇప్పటికి తాము కట్టుబడి ఉన్నామన్నారు అలాగే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని రాష్ట్రాల జనాభా, ఆయా రాష్ట్రాల మూలధన వ్యయం (క్యాపిటెల్ ఎక్స్‌పెండిచర్)ను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. దీని వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 15వ ఆర్థిక సంఘం విలువ తగ్గింపు (డెవెల్యూషన్) గ్రాంటు 2.43 నుంచి 2.13 శాతానికి తగ్గించడం తెలంగాణ పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నదన్నారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లు తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.723 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కాగా ఆదాయంలో కొరత ఏర్పడి తే జిఎస్‌టి పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాల కు పరిహారాన్ని ప్రతి రెండు నెలలకు చెల్లించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రాలకు చెల్లించే పరిహారాన్ని విధిగా పరిహా ర నిధి నుండే చెల్లించాలన్నారు. సెస్‌తో పాటు జిఎస్‌టి కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పనిసరిగా జిఎస్‌టి పరిహార నిధిలో జమ చేయాలని ఆయన సూచించారు.

ఆప్షన్ 1, ఆప్షన్ 2 కింద పేర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్ 10(1) చెబుతోందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దీనిపైన జిఎస్‌టి కౌన్సి ల్ చర్చించ వచ్చన్నారు. ప్రధానంగా ఆప్షన్ 1లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్ష పది వేల కోట్లకు, ఆప్షన్ 2లో లక్ష 83 వేల కోట్లుకు రివైజ్డ్ చేయడం జరిగిందన్నారు. వీటి మధ్య అంతరం రూ.73 వేల కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఇదేమి పెద్ద మొత్తం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఆప్షన్ 1లో పేర్కొ న్న పరిహారంతో పాటు అనదంగా రూ 73 వేల కోట్లు చెల్లించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చత్తీస్‌గఢ్ మంత్రి చెప్పినట్లు జిఎస్‌టి పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం ఆర్టికల్ 293 పరిధిలో ఉండదని, దీనిని తాను సమర్థిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News