Friday, May 17, 2024

జైళ్ల ఉత్పత్తులకు భలే గిరాకి

- Advertisement -
- Advertisement -

State Prisons in the first place across India

 

ఏడాదిన్నర కాలంలో రూ. 700 కోట్ల ఆదాయం

దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో రాష్ట్ర జైళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రాష్ట్రంలోని జైళ్లలో తయారవుతున్న ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. గడచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని జైళ్లలో జరిగిన ఉత్పత్తుల వల్ల జైళ్ల శాఖకు దాదాపు రూ. 700 కోట్లు ఆదాయం వచ్చినట్లు జైళ్లశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో వివిధ రకాలైన వస్తువులను తయారుచేయడంలో రాష్ట్ర ఖైదీలు దేశంలో మొదటిస్థానంలో నిలవడం గమనార్హం. 2019 నుంచి 2020 జూన్ నెల వరకు రాష్ట్ర ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా రూ.600 కోట్ల ఆదాయం జైళ్లశాఖకు వచ్చినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దంతో దేశవ్యాప్తంగా మిగితా జైళ్లతో పోలిస్తే రాష్ట్ర జైళ్ల శాఖ మొదటి స్థానంలో నిలించింది. ఇదిలాఉండగా ఆదాయం విషయంలో దేశంలో మిగతా రాష్ట్రాలు రాష్ట్ర ఆదాయానికి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం తరువాత తమిళనాడుకు రూ.93కోట్లు, మహరాష్ట్రకు రూ.49 ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆదాయాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఒక్కోఖైదీ సగటున రూ. 6.5 లక్షల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసినట్లు ఎన్‌సిఆర్‌బి తన నివేదికలోనూ పేర్కొంది. దేశంలోని మొత్తం ఉత్పత్తుల్లో 74శాతం తెలంగాణ నుంచే ఉన్నాయని పేర్కొంది. ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కరోనా సమయంలో మాస్క్‌లు, శానిటైజర్లు ఖైదీలు తయారీ చేశారు. జైళ్లలో ఖైదీలు తయారు చేసిన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ముసినిపల్ కార్యాలయాలు, లైబ్రరీ, ఆస్పత్రులు, విశ్వ విద్యాలయాల అధికారులు స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తుండటం గమనార్హం. అదేవిధంగా దుప్పట్లు, అల్మారాలు, కంప్యూటర్ టేబుళ్లు, సబ్బులు, పినాయిల్ , చేనేత వస్తువులు, ఇంటి ముందు గేట్లు, అగర్‌బత్తీలు వంటి వస్తువుల నాణ్యతలో కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఖైదీలు తయారు చేస్తున్నారని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి.

జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఆసక్తి వున్న రంగాల్లో శిక్షణ ఇస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తూ జైలు అధికారులు చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. జైలులోని పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తులను తయారు చేయిస్తూ వారిలో ఎప్పటికప్పుడు జైలు అధికారులు మనోస్థైర్యాన్ని నింపుతున్నారు. కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారుచేసిన వస్తువుల పెద్ద ఎత్తున గిరాకి రావడంతో పాటు భారీ ఎత్తున ఆదాయం వస్తుందని, ఈక్రమంలో ఖైదీలకు మరిన్ని ఉత్పత్తులపై శిక్షణ ఇస్తే రెట్టింపు ఆదాయాలు సాధించవచ్చని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

జీవిత కాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమకు తెలిసిన వృత్తిలో కొనసాగుతూ జైళ్ల శాఖకు లక్షల్లో ఆదాయాన్ని సమకూర్చుతూ, కుటుంబ అవసరాలకు కొంత మొత్తాన్ని జైలులో సంపాదిస్తూ ముందుకు సాగుతుండటం గమనార్హం. జైలులో నెలకొల్పిన పరిశ్రమల్లో తయారు చేస్తున్న ఉత్పత్తులకు సంబంధించి మరింత మెరుగైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే కార్పొరేట్ ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా వస్తువులు తయారు చేసి జైళ్ల శాఖకు మరిన్ని లాభాలను అందించగలమని అటు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, ఇటు జీవిత ఖైదీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News