Monday, April 29, 2024

ఆశావర్కర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

asha workers

 

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆశావర్కర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బందిని ఇబ్బందులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…రాష్ట్రంలో ఇంటింటికి సర్వే చేస్తూ కరోనా అనుమానిత లక్షణాల వ్యక్తులను గుర్తిస్తున్న ఆశావర్కర్లు, నర్సులు, ఏఎన్‌ఎమ్‌లపై దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఇటీవల నిజామాబాద్ తదితర జిల్లాల్లో దాడులు చేసిన వారిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన తెలిపారు.

ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న వైద్యులు, మెడికల్ సిబ్బందిపై దాడులు జరిగితే వైద్యారోగ్యశాఖ చొరవ తీసుకొని నేరుగా కేసులు పెట్టేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి అధికారులకు సుచించారు. ప్రతి రోజూ జిల్లా వైద్యాధికారులు ఆయా జిల్లాల్లో చేస్తున్న ఇంటింటి సర్వే పరిస్థితిపై ఉన్నతాధికారులకు వెంటనే తెలపాలని, సర్వే చేసే ఆశావర్కర్లకు కూడా ప్రత్యేక రక్షణ కిట్లు అందించాలని ఆయన అన్నారు. ఎక్కడ ఇబ్బందులు ఎదురైన వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చి, వారికి తగిన రక్షణ కల్పించే దిశగా జిల్లా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు సర్వే చేసే క్రమంలో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు సామాజిక దూరం పాటించాలని, నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ శ్రీనివాసరావు, డిఎంఇ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Strict action on attacked on asha workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News