Monday, April 29, 2024

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతాలక్ష్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చైర్‌పర్సన్‌తోపాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ఆదివారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. చైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేండ్ల వరకు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్మన్‌గా వాకిటి సునీతా లక్ష్మిరెడ్డి, కమిషన్ సభ్యులుగా షాహీనా అఫ్రోజ్, కుర్మ ఈశ్వరీ, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మి. కటారి రేవతీరావులు నియమించినట్లు సిఎస్ సోమేష్‌కుమర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి మహిళా కమిషన్:
ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవిర్భవించిన అనంతరం తొలి మహిళా కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈక్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తరువాత తొలి మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కమిషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు వారి పదవీ కాలాన్ని ప్రమాణ స్వీకారం తేదీ నాటి నుంచి ఐదేళ్ల వరకు అవకాశం కల్పించారు.
సునీతాలక్ష్మారెడ్డి రాజకీయ ప్రస్థానం: 
గతంలో సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్‌నుండి వరసగా మూడుసార్లు ఎంఎలఎగా విజయం సాధించారు. 1999, 2004,2009 వ సంవత్సరాల్లో ఆమె ఎంఎల్‌ఎ గెలుపొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోసునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేశారు. అయితే, 2014లో జరిగిన మెదక్ ఉప ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ తరపున పోటీ చేసి సునీతలక్ష్మారెడ్డి ఓటమిపాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఆమెకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి లభించడం విశేషం.

Sunitha Laxma Reddy Appointed as Womens Commission Chairperson

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News