Monday, April 29, 2024

టీ20 ప్రపంచకప్‌: స్కాట్లాండ్‌ను ఓడించిన నమీబియా..

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ట్వంటీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్2 రెండో మ్యాచ్‌లో నమీబియా 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని చేదించేందుకు కూడా నమీబియా తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. స్కాట్లాండ్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో నమీబియా బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేశారు. ఓపెనర్లు క్రెగ్ విలియమ్స్ (23), మైఖేల్ వాన్ లింగెన్ (18)లు కాస్త బాగానే ఆడినా కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో జట్టుకు ఇబ్బందులు మొదలయ్యాయి.

ఇక గ్రీన్ (9), కెప్టెన్ ఎరాస్‌మస్ (4) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కానీ స్మిత్ రెండు ఫోర్లు, మరో 2 సిక్సర్లతో అజేయంగా 32 పరుగులు చేసి నమీబియాను గెలిపించాడు. ఇక డేవిడ్ వీస్(16) తనవంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో నమీబియా బౌలర్లు సఫలమయ్యారు. రుబేన్ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. జాన్ ఫ్రిలింక్ 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. స్మిత్, వీస్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో స్కాట్లాండ్ స్కోరు 109 పరుగులకే పరిమితమైంది. లీస్క్(44), క్రిస్ గ్రీవ్స్ (25) మాత్రమే రాణించగా మిగతావారు విఫలమయ్యారు.

T20 World Cup: Namibia beat Scotland with 4 Wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News