Friday, May 17, 2024

జిహెచ్ఎంసిలో విలీనంతోనే కంటోన్మెంట్ అభివృద్ధి: తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani inaugurates Double houses at Silver Compound

హైదరాబాద్: కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ లో రూ.17 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంఎల్ఎ సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ”కంటోన్మెంట్ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు.జిహెచ్ఎంసిలో విలీనం అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల మాదిరిగానే కంటోన్మెంట్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. పేద ప్రజలు ఆత్మగౌరవంతో గొప్పగా బ్రతకాలనేది సిఎం కెసిఆర్ లక్ష్యం. పూర్తిగా ప్రభుత్వ నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడైనా నిర్మిస్తున్నారా. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది” అని అన్నారు.

Talasani inaugurates Double houses at Silver Compound

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News