Monday, April 29, 2024

పాక్‌లో తెరుచుకున్న తాలిబన్ల రాయబార కార్యాలయం

- Advertisement -
- Advertisement -

Taliban embassy opened in Pakistan

మొదలైన దౌత్య కార్యకలాపాలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ గుట్టుచప్పుడు కాకుండా తమ దేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబార, దౌత్య కార్యాలయాను తాలిబన్లకు అప్పగిస్తోంది. తాలిబన్ దౌత్యవేత్తలకు వీసాలు జారీ చేస్తోంది. అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని పాక్ ఇంకా గుర్తించకపోవడం గమనార్హం. ఇస్లామాబాద్‌లోని అఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో తాలిబన్ల మొదటి కార్యదర్శిగా సర్దార్ ముహ్మద్ షోకాయిబ్, దౌత్యవేత్తలుగా పెషావర్‌లో హఫీజ్ మొహిబుల్లా, క్వెట్టాలో ముల్లాగులామ్ రసూల్, కరాచీలో ముల్లా ముహ్మద్ అబ్బాస్ బాధ్యతలు చేపట్టినట్టు పాక్ పత్రిక డాన్ వెల్లడించింది. అఫ్ఘాన్ రాయబార కార్యాలయం ఈ ఏడాది జులై నుంచి ఖాళీగా ఉంటోంది. తాలిబన్లు అఫ్ఘానిస్థాన్‌లో అధికారం చేపట్టకముందే ఓ సంఘటన నేపథ్యంలో గత ప్రభుత్వ రాయబారి నజీబుల్లా అలీఖిల్ ఇస్లామాబాద్‌ను ఖాళీ చేసి వెళ్లారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News