Saturday, April 27, 2024

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

- Advertisement -
- Advertisement -

krishnaveni

 

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమవారం మృతిచెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయన రవీంద్ర ఆర్ట్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, డాక్టర్ బాబు తదితర అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్‌బాబు చనిపోయారు. చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. ఇక కృష్ణవేణి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో భరద్వాజను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు.

 

Tammareddy bharadwaja mother passed away
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News